pizza
Husharu press meet
`హుషారు` ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


01 October 2018
Hyderabad

ల‌క్కీ మీడియా నిర్మిస్తున్న సినిమా `హుషారు`. తేజ‌స్ కంచెర్ల‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ చుంచు, దినేష్ తేజ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ద‌క్ష నాగార్క‌ర్‌, ప్రియ వ‌డ్ల‌మాని, హేమ ఇంగ్లి, ర‌మ్య‌, అప్పాజీ, ప్ర‌మోదిని కీల‌క పాత్ర‌ధారులు. శ్రీ హ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌కుడు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌. `నానానా` అనే పాట‌ను సోమ‌వారం విడుద‌ల చేశారు. భాస్క‌ర‌భ‌ట్ల సాహిత్యం అందించిన ఈ పాట‌ను దిల్‌రాజు విడుద‌ల చేశారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ``బెక్కం వేణుగోపాల్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి సినిమాను తీస్తున్నాన‌ని చెప్ప‌గానే నేను న‌వ్వాను. ఏదో విష‌యం ఉంటే త‌ప్ప సినిమాలు ఆడ‌టం లేదని చెప్పాను. `ఎకాన‌మీ బ‌డ్జెట్‌లో తీస్తున్నాను` అని చెప్పాడు. అందుకు `స‌రే`న‌న్నా. `ఓ పాట‌ను విడుద‌ల చేస్తున్నా.. రండి` అని పిలిచాడు. వ‌చ్చి చూశాను. పోస్ట‌ర్ మీద `నేను చెడు త‌ప్ప ఏదీ విన‌ను. నేను చెడు త‌ప్ప ఏదీ మాట్లాడ‌ను... `అని క్యాప్ష‌న్స్ ఉన్నాయి. నేను మంచి చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాను. కానీ వీళ్లేమో... న‌న్ను పిలిచి నానానా అనే పాట‌ను విడుద‌ల చేయ‌మ‌ని అన్నారు. అయినా ఇప్పుడు ప్రేక్ష‌కులు మంచీ, చెడు ఆలోచించ‌డం లేదు. వాళ్లు ఎంట‌ర్‌టైన్ అయ్యామా? లేదా? అనేదే చూస్తున్నారు. అంతేగానీ లిప్‌లాక్‌లున్నాయా... ఇంకోటున్నాయా? అనే ప‌ట్టింపులు ఉండ‌టం లేదు. భ‌విష్య‌త్తులో వీళ్ల దారికే నేను రావాల్సి ఉంటుందేమో. సినిమా బాగా ఆడాల‌ని కోరుకుంటున్నా`` అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ `` మా ల‌క్కీ మీడియాను ఏర్పాటు చేసిన త‌ర్వాత తొమ్మిది సినిమాలు చేశాం. మా లాస్ట్ సినిమా `నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్`. అంత‌కు ముందు `సినిమా చూపిస్త మావ‌` చేశా. దిల్‌రాజు తీసిన `నేను లోకల్`కి ప‌నిచేశా. యూత్‌ఫుల్ సినిమా తీయాల‌నుకుంటున్న‌ప్పుడు శ్రీహ‌ర్ష ఈ స్క్రిప్ట్ చెప్పాడు. క‌థ న‌చ్చింది. వెంట‌నే సినిమా మొద‌లుపెట్టాం. సినిమా మొత్తం రెడీ అయింది. నా టెక్నీషియన్స్ ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల‌ని ప్రెస్‌మీట్ పెట్టాం. మా ద‌ర్శ‌కుడు శ్రీహ‌ర్ష కొంద‌రు ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర ప‌నిచేశారు. బాలీవుడ్‌లోనూ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఈసినిమా చాలా బాగా వ‌చ్చింది. సంగీత ద‌ర్శ‌కుడు ర‌థ‌న్ కి అందాల రాక్ష‌సి నుంచి నేను ఫ్యాన్‌. ఈ సినిమాకు మంచి ట్యూన్లిచ్చారు. `అర్జున్ రెడ్డి` త‌ర్వాత త‌ను సంగీతం చేసిన సినిమా ఇది. చిన్న సినిమాకు చేస్తాడో లేదోన‌ని అనుకున్నా. కానీ క‌థ న‌చ్చి వెంట‌నే సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు. భాస్క‌ర‌భ‌ట్ల ఎనిమిది నెల‌ల క్రితం ఈ పాట రాశారు. ఈ పాట‌ను విడుద‌ల చేస్తున్నామ‌ని చెప్ప‌గానే `లిరిక్స్ ని అలాగే ఉంచారా? ఏమైనా మార్చారా?` అని అడిగారు. `ఏమీ మార్చ‌లేద‌ని చెప్పాను` త‌ను ఇప్పుడు రావ‌డం హ
్యాపీ. ఈ క‌థ‌కి కొత్త కుర్రాళ్లు స‌రిపోతార‌నుకున్నాం. తేజ‌స్ ఇంత‌కు ముందు ఉల‌వ‌చారు బిర్యానీ, కేటుగాడు అని రెండు సినిమాలు చేశాడు. మిగిలిన వాళ్లంద‌రూ కొత్త‌వారే. అయినా చాలా బాగా చేశారు. మా ఆఫీసులోనే సినిమా రిహార్సల్స్ చేసుకుని వెళ్లి షూటింగ్ చేశారు`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``ఈ రోజుల్లో లైఫ్‌కి గ్యారంటీ లేదు. ప్ర‌తి సెక‌నూ హ్యాపీగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు. మెమ‌రీస్ త‌ప్ప మ‌నం జీవితంలో ఇంకేటినీ పైకి తీసుకెళ్ల‌లేం అనే కాన్సెప్ట్ తో సినిమాను తెర‌కెక్కించాం`` అని అన్నారు.

ర‌థ‌న్ మాట్ల‌డుతూ ``ద‌ర్శ‌కుడి ఎన‌ర్జీ నాకు చాలా ఇష్టం. త‌ను త‌న రెండో సినిమా చేస్తాడో లేదో నాకు తెలియ‌దు. ఎందుకంటే త‌న‌కు అంత కేప‌బులిటీ ఉంది. నేను అర్జున్ రెడ్డి త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. కానీ ఆ సినిమాలోని పాట‌ల క‌న్నా.. ఈ సినిమాలోని పాట‌లంటేనే మాకు ఇష్టం`` అని అన్నారు.

భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్ మాట్లాడుతూ ``మేం వ‌య‌సుకు వ‌చ్చాం స‌మ‌యం నుంచి బెక్కం వేణుగోపాల్‌తో ఈ జ‌ర్నీ సాగుతోంది. త‌న ప్ర‌తి సినిమాలోనూ నాకు అవ‌కాశం ఇస్తుంటాడు. త‌ను నాకు ఇష్ట‌మైన మ‌నిషి. క‌ష్ట‌ప‌డి పైకొచ్చిన మ‌నిషి. ఈ మ‌ధ్య కాలంలో నేను చూసిన ద‌ర్శ‌కుల్లో నాకు న‌చ్చిన ద‌ర్శ‌కుడు శ్రీహ‌ర్ష‌. మామూలుగా సిట్చువేష‌న్స్ చెప్పి పాట‌లు రాయ‌మంటారు. కానీ శ్రీహ‌ర్ష మాత్రం కొన్ని విజువ‌ల్స్ చూపించి త‌నెలా తీయ‌బోతున్నాడో చెప్పి, న‌న్ను పాట రాయ‌మ‌న్నాడు. నేను ఏ సంగీత ద‌ర్శ‌కుడితో తొలిసారి ప‌నిచేసినా ఆ సినిమా హిట్ అయింది. చ‌క్రి నుంచి మొన్న‌టి స్వ‌ర‌సాగ‌ర మ‌హ‌తి వ‌ర‌కు నా సెంటిమెంట్ హిట్ అయింది`` అని చెప్పారు.

తేజ‌స్ మాట్లాడుతూ ``కాస్త గ్యాప్ త‌ర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. క‌థ విన్నాక సినిమా చేయాల‌నుకున్నా. పాట‌లు విన్నాక అస‌లు మిస్ కాకూడ‌ద‌ని అనుకున్నా. ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అవుతుంది. బ్యాడ్ బిహేవియ‌ర్ గురించి, ఫ్రెండ్‌షిప్ గురించి ఉంటుంది`` అని అన్నారు.

అభిన‌వ్ మాట్లాడుతూ `` సినిమాలో జై క్యార‌క్ట‌ర్ చేశాను. చాలా ఇన్నొసెంట్ కేర‌క్ట‌ర్ ఇది`` అని అన్నారు.

ప్రియా వ‌డ్ల‌మాని మాట్లాడుతూ ``ఏడాదిన్న‌రగా ఈ సినిమాతో ట్రావెల్ అవుతున్నా. హ‌ర్ష చాలా క‌ష్ట‌ప‌డి చేశాడు` అని అన్నారు.

తేజ మాట్లాడుతూ ``ఈ సినిమాలో నేను చెడు త‌ప్ప ఏదీ చేయ‌ని పాత్ర చేశాను`` అని చెప్పారు.

అసోసియేట్ నిర్మాత లింగా శ్రీనివాస్ మాట్లాడుతూ ``2007 నుంచి మేం వ్యాపారంలో ఉన్నాం. నాకు మూడో త‌ర‌గ‌తి నుంచి సినిమాలంటే పిచ్చి. తిరునాళ్ల‌ల్లో ఒక్కోరోజు ఆరు ఆట‌లు కూడా చూసేవాడిని. సినిమా నిర్మాణం అనేది మా క‌ల‌. ఆ క‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి గోపీగారు స‌హ‌క‌రించారు. ఎప్పుడు మేం ఆఫీసుకు వెళ్లినా అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డుతూ ఉండేవారు. సినిమా నిర్మాణం చాలా క‌ష్ట‌మ‌ని అనిపించింది. కానీ.. అదేం అంత క‌ష్టం కాద‌నీ.. సుల‌భ‌మ‌ని ఆయ‌న తెలిపారు. 2021లో ఆయ‌న‌తో క‌లిసి భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తాం`` అని అన్నారు.

అసోసియేట్ నిర్మాత ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడుతూ ``గోపీతో ప‌రిచయం వ‌ల్ల నేను ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాను. కొత్త‌వాళ్ల‌యినా మా సినిమాలో అంద‌రూ బాగా న‌టించారు. శ్రీహ‌ర్ష చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డారు`` అని చెప్పారు.

ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట‌, సంగీతం: ర‌థ‌న్‌, ఎడిట‌ర్‌: విజ‌య్ వ‌ర్ధ‌న్ కావూరి, ఆర్ట్: మారేష్ శివ‌న్‌, పాట‌లు: భాస్క‌ర‌భ‌ట్ల‌, గాయ‌కుడు: బోబో శ‌శి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: నాగార్జున వ‌డ్డే (అర్జున్‌), స్టంట్స్: రియ‌ల్ స‌తీశ్‌, నృత్యాలు: సుభాష్‌.

 



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved