'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ ' మేము వయసుకు వచ్చాం' , ' సినిమా చూపిస్త మావ' లాంటి సూపర్ హిట్లు తీశారు. ఈ సంస్థలో 9 వ చిత్రంగా 'హుషారు' తీస్తున్నారు. రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి,అభినవ్ చుంచు, దినేష్ తేజ్, దక్ష నాగర్కర్, ప్రియా వడ్లమాని,హేమ ఇంగ్లే ప్రధాన తారాగణం . 'అర్జున్ రెడ్డి' తో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్ , ఛాయాగ్రాహకుడు రాజ్ తోట ఈ చిత్రానికి పనిచేశారు . ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 7న విడుదలకి సిద్దమయింది.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ``రిలీజ్ డే దగ్గర పడే కొద్దీ నేను రిలాక్స్ గా ఫీలవుతున్నా. ఫైనల్‌గా రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ నేను ఎంజాయ్ చేస్తున్నా. మా డిస్ట్రిబ్యూటర్ ఫ్రెండ్స్ అందరూ డిసెంబర్ 7న సినిమాను విడుదల చేయమని సలహా ఇచ్చారు. అలాగే మేం విడుదల చేస్తున్నాం. దొరికిన టైమ్‌ని నేను సినిమాలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేయడానికి ఉపయోగించుకుంటున్నాం. డిసెంబర్ 7న ఇక్కడే ఎన్నికలున్నాయి. ఏపీలో లేవు. యు.ఎస్‌లోనూ ఆ డేట్ చాలా బావుంటుంది. అందుకే చేస్తున్నాం. సినిమా ఫ్రెష్ ఫీల్‌తో ఉంటుంది`` అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వచ్చింది. నలుగురు ఫ్రెండ్స్ సరదాగా థియేటర్‌కి వెళ్లి చూసేలా ఉంటుంది. సెట్లో కలిసిన మేమందరం కలిసి మెలిసి ఫ్రెండ్స్ లాగా ఉన్నాం. విజువల్స్ గ్రేట్‌గా వచ్చాయి. ఔట్‌పుట్ చాలా బావుంది. రాహుల్ రామకృష్ణ కామెడీ నవ్విస్తుంది. జీవితం అంటేనే జ్ఞాపకాలు. అలాంటి చాలా జ్ఞాపకాలను ఈ సినిమాలో చూస్దారు`` అని అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ బాబీ మాట్లాడుతూ ``బెక్కం వేణుగోపాల్ సినిమా తీస్తున్నారంటేనే ఏమీ లేకుంటే తీయరని మాకు తెలుసు. ఆయనకు కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి. ఆడియన్స్ పల్స్ తెలుసుకుంటారు. ఉండిపోవే పాటను రెండు సార్లు రికార్డింగ్ చేయించారు. అయినా నచ్చకపోవడంతో మరలా సిద్ శ్రీరామ్‌తో పాడించారు. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసినా అదే రింగ్ టోన్ వస్తోంది`` అని అన్నారు.
సినిమాకు పనిచేయడం పట్ల నటీనటులు, టెక్నీషియన్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ : వీణా రాణి , అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : లక్ష్మినారాయణ , లింగా శ్రీనివాస్ .