21 November 2018
Hyderabad
బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘హుషారు’. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘లైఫ్‌లో గెలవడం అంటే ఏమిటి, ఓడిపోవడం అంటే ఏమిటి అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. మనం ఎంతకాలం ఉంటామో తెలీదు. ఉన్నంతకాలం మనకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసిన వాడే హ్యాపీగా బ్రతికినట్టు. చివరి రోజుల్లో మనకు చెప్పుకోవడానికి మంచి మెమరీస్ ఉండాలి. యూత్‌కి మంచి మెసేజ్‌ని ఇస్తూనే ఎంటర్‌టైన్‌మెంట్ వేలో సినిమా రూపొందించం జరిగింది. ఈ సినిమా మొత్తం హైదరాబాద్‌లోనే తీశాం. ఒక్కరోజు హీరోయిన్ బ్యాక్‌డ్రాప్ కోసం ముంబాయ్‌లో చేయడం జరిగింది. ఒక పాట కేరళలోని చేలకుడిలో చేశాం. డైరెక్టర్ శ్రీహర్ష రాసిన కథ, కొత్త డైలాగ్స్, అర్జున్‌రెడ్డి టీమ్ మ్యూజిక్ డైరెక్టర్ రథన్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట హైలైట్స్‌గా ఉంటాయి. సన్ని ఎం.ఆర్. ఒక పాట చేయడంతోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చేశారు. మాస్టర్జీగారు ఒక మంచి పాట రాశారు. ఆ పాట చాలా బాగా వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈమధ్య థియేటర్స్‌కి వచ్చే ప్రేక్షకులు బాగా పెరిగారు. మా ‘హుషారు’ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాకి గురించి త్వరలోనే ఎనౌన్స్ చేస్తాను. రెండు సినిమాలు అనుకుంటున్నాను. అందులో ఒక సినిమా మాత్రం ఇమ్మీడియట్‌గా స్టార్ట్ చేస్తాను’’ అన్నారు.