pizza
Ismart Shankar press meet
'ఇస్మార్ట్‌ శంకర్‌'గా రామ్‌ ప్రేక్షకుల మైండ్‌లో నిలిచిపోతాడు - డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌

You are at idlebrain.com > News > Functions
Follow Us


11 July 2019
Hyderabad

'ఇస్మార్ట్‌ శంకర్‌'గా రామ్‌ ప్రేక్షకుల మైండ్‌లో నిలిచిపోతాడు - డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోహీరోయిన్లుగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'ఇస్మార్ట్‌ శంకర్‌'. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకుడు. జూలై 18న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో బోనాలు కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు గుంటూరు వివిఐటీ కాలేజ్‌లో విద్యార్థులతో కలిసి సందడి చేశారు. ఇటీవల హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా...

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ - ''మణిశర్మగారు మా సినిమాకు పెద్ద పిల్లర్‌. అడగ్గానే ఐదు పాటలు నా మొహన కొట్టారు. రీసెంట్‌ టైమ్‌లో మంచి ఆల్బమ్‌ అని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. అలాగే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కుమ్మేశారు. సెన్సార్‌పూర్తి కావాల్సి ఉంది. రామ్‌తో తొలిసారి కలిసి పనిచేశాను. తనలో ఎనర్జీ అన్‌లిమిటెడ్‌. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. నాకు చేతనైనంత వాడాను. ఇంకా బోలెడు ఎనర్జి. లైవ్‌లో క్యారెక్టర్‌ చేశాడు. మైండ్‌లోతన క్యారెక్టర్‌ రన్‌ అవుతూనే ఉంటుంది. ఇస్మార్ట్‌ శంకర్‌ మైండ్‌లో నిలిచిపోతాడు. రామ్‌ ఓ గ్రేట్‌ యాక్టర్‌. రామ్‌ మాట్లాడిన తెలంగాణ యాక్సెంట్‌ సినిమాకే హైలైట్‌. సినిమా పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌'' అన్నారు.

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ మాట్లాడుతూ - ''రేపు థియేటర్‌లో 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాను ప్రేక్షకులు రెండు గంటలు చూసి ఎంజాయ్‌ చేస్తారు. కానీ ఈ సినిమా కోసం పనిచేసిన ఈ ఆరు నెలల కాలం నా లైఫ్‌లోనే బెస్ట్‌ టైమ్‌. సినిమా ఆల్‌ రెడీ చూసి ఉన్నాం. సినిమా చాలా చేసినట్లు అనిపించింది కానీ .. సినిమా ఎలా పూర్తి చేశానో తెలియడం లేదు. ఆనీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన ఉండిపో ఉండిపో.. సాంగ్‌ ఆడియెన్స్‌ను సీట్‌కు అలా కట్టేసి ఉంచుతుంది. ఆమె ఆ సాంగ్‌ను అంత గొప్పగా కంపోజ్‌ చేశారు. ఇక మణిశర్మగారికి థాంక్స్‌. సినిమాలో పాటలన్నీ ఒక ఎత్తు అయితే.. రీరికార్డింగ్‌ మరో ఎత్తు. సినిమాలో ప్రతి ఎలిమెంట్‌ను ఎంజాయ్‌ చేస్తారు. రాజ్‌తోటగారు అద్భుతమైన విజువల్స్‌ అందించారు. నిధి అగర్వాల్‌కు థాంక్స్‌. తను అద్భుతంగా పాత్రలో ఒదిగిపోయింది. శంకర్‌ క్యారెక్టర్‌కు సరిపోయేలా ఓ డేరింగ్‌ క్యారెక్టర్‌ను చేసింది. లొకేషన్‌లో అందరి కష్టాలను తీసుకుని మా అందరినీ కూల్‌గా ఉంచింది. అలాగే విసురెడ్డి వంటి మనుషులు చాలా తక్కువ. పని చేస్తున్నట్లే తెలియదు. కానీ పనంతా పూర్తి చేస్తుంటారాయన. ఈ సినిమా కోసం నేను గోవా వెళ్లినప్పటి నుండి ఇప్పటి వరకు నా కెరీర్‌లోనే బెస్ట్‌ టైమ్‌ అని మరోసారి చెబుతున్నాను. పూరికి థాంక్స్‌. మీడియా క్రియేటెడ్‌ ప్రాజెక్ట్‌ ఇది. జూలై 18న మా ఇస్మార్ట్‌ శంకర్‌ విడుదలవుతుంది. నాకు సినిమా ఎంత నచ్చిందో చెప్పాను. నేను ఫీల్‌ అయిన దాంట్లో ఒక శాతం ఫీల్‌ అయినా కూడా.. నాకు అదే వంద శాతం శాటిస్‌ఫ్యాక్షన్‌ ఇచ్చినట్టు అవుతుంది'' అన్నారు.

నిర్మాత ఛార్మి కౌర్‌ మాట్లాడుతూ - ''సినిమా ఫస్ట్‌ కాపీ చూశాం. కాన్ఫిడెన్స్‌ మరింత పెరిగింది. సినిమా సక్సెస్‌ అయిన ఫీలింగ్‌ వచ్చింది. నాకే కాదు.. యూనిట్‌ అందరికీ అదే నమ్మకం ఏర్పడింది. సినిమా చూసేవాళ్లందరికీ ఫుల్‌ మీల్స్‌లాంటి సినిమా. ఈ సినిమాలో చాలా మంది సపోర్ట్‌ చేశారు. నిధి, నభా వారి పాత్రల్లో వారు తప్ప మరెవరూ చేయలేరనే విధంగా నటించారు. రామ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటన చూసిన నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. తను లేకుండా ఇస్మార్ట్‌ శంకర్‌ లేదు. వన్‌ మ్యాన్‌ షో. పూరిగారు నెరేషన్‌ ఇచ్చినప్పుడు ఉన్న ఎనర్జి.. సినిమాను తెరపై చూసినప్పుడు అదే ఎనర్జీ కనపడుతుంది. పూరితో రామ్‌ మళ్లీ పనిచేయాలని అందరూ కోరుకునేలా సినిమా ఉంటుంది'' అన్నారు.

నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ - ''నేను పూరిగారితో కలిసి పనిచేయాలని ఎదురు చూశాను. కానీ తక్కువ సమయంలోనే ఆయనతో కలిసి పనిచేయడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. రామ్‌తో పనిచేయడం హ్యాపీ. తను మంచి డ్యాన్సర్‌. తనలో ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నభానటేశ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

నభా నటేశ్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో పూరిగారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయనకు థాంక్స్‌. చాలా బ్యూటీఫుల్‌ క్యారెక్టర్‌ రాసి.. నాకు అవకాశం ఇచ్చారు. రామ్‌ చాలా మంచి కోస్టార్‌. ఈ సినిమా చూసిన వాళ్లందరూ శంకర్‌ను ఇష్టపడతారు. ఛార్మిగారికి థాంక్స్‌. నిధికి థాంక్స్‌. మణిశర్మగారి మ్యూజిక్‌ కుమ్మేసింది. డబుల్‌ మీటాలా ఎంజాయ్‌ చేస్తున్నారు'' అన్నారు.

డ్యాన్స్‌ మాస్టర్‌ ఆనీ మాట్లాడుతూ - ''నేను ప్రతిసారి పూరిగారి సినిమాలో ఏదో ఒక సినిమాను చేస్తూనే ఉన్నాను. ఈ సినిమాలో మాల్దీవుల్లో చాలా మంచి సాంగ్‌ చేశారు. అలాగే రామ్‌తో తొలిసారి పనిచేశాను. తను వన్‌ టేక్‌ ఆర్టిస్ట్‌'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved