pizza
Nartanasala press meet
`@న‌ర్త‌న‌శాల‌` ప్రెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


18 August 2018
Hyderabad

`ఛ‌లో` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం `@న‌ర్త‌న‌శాల`. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాత. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఆగ‌స్ట్ 24న ఈ సినిమా ప్రి రిలీజ్ కార్య‌క్ర‌మం.. 30న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా...

ఉషా ముల్పూరి మాట్లాడుతూ - ''ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, వీడియో సాంగ్‌ అన్ని రిలీజై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. ఆడియెన్‌కు సినిమా బాగా రీచ్‌ అయింది. ఆగస్ట్‌ 24న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. అలాగే ఆగస్ట్‌ 30న సినిమాను విడుదల చేస్తున్నాం. ఛలో చిత్రానికి సపోర్ట్‌ అందించినట్లే నర్తనశాలకు సపోర్ట్‌ చేస్తారని నమ్ముతున్నాం. నాగశౌర్య పాత్ర లేడీస్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది. ఎంటర్‌టైనింగ్‌ సినిమా అందరినీ మెప్పిస్తుంది. మా డైరెక్టర్‌ శ్రీనివాస్‌ చక్రవర్తిగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు'' అన్నారు.

శ్రీనివాస్‌ చక్రవర్తి మాట్లాడుతూ ''సినిమాను చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు నిర్మాతలు. పండుగలా సినిమా ఉంటుంది. రెండు సాంగ్స్‌, టీజర్‌ విడుదల చేశాం. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. ఎంటర్‌టైనింగ్‌ సినిమా ఉంటుంది. నాగశౌర్యలాంటి అబ్బాయి మా ఇంట్లో ఉంటే బావుంటుందని అందరూ అనుకునే పాత్రలో శౌర్య చక్కగా నటించారు. సాగర్‌ మహతి అద్భుతమైన సంగీతం, ఆర్‌.ఆర్‌ అందించారు, విజయ్‌కుమార్‌గారు అద్భుతమైన విజువల్స్‌ అందించారు. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ను తెలియజేసేలా హీరో ఇందులో స్కూల్‌ను నడుపుతుంటారు. పాత నర్తనశాలకు, ఈ నర్తనశాలకు ప్యారలెల్‌ క్యారెక్టర్స్‌ ఉంటాయి. అప్పట్లోని మిథ్‌ను ఇప్పట్లో ఎలా తీసుకొచ్చామనేది కూడా ఈ సినిమాలో చూస్తారు'' అన్నారు.

శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి మాట్లాడుతూ ''ఛలో తర్వాత మా బ్యానర్‌ నుండి వస్తున్న మరో చిత్రమే నర్తనశాల. డైరెక్టర్‌గారు, సాగర్‌ మహతి, సాగర్‌ మహతి అందరూ అద్భుతమైన సపోర్ట్‌ను అందించారు'' అన్నారు.

 

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved