pizza
Super Sketch Press Meet
`సూప‌ర్ స్కెచ్‌` ప్రెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

9 May 2018
Hyderabad

యు అండ్ ఐ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో ఫిల్మ్ అకాడ‌మీ స‌హ‌కారంతో శ్రీ శుక్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం `సూప‌ర్ స్కెచ్‌`. న‌ర్సింగ్ మ‌క్క‌ల‌, ఇంద్ర‌, స‌మీర్ ద‌త్త‌, కార్తీక్ రెడ్డి, చ‌క్రి మాగంటి త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ధారులు. బ‌ల‌రామ్ మ‌క్క‌ల‌, ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మాత‌లు. ర‌విచావ‌లి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ప్రెస్ మీట్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో...

రవిచావ‌లి మాట్లాడుతూ - ``సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. హాలీవుడ్‌, బాలీవుడ్ ఫిలింగ్‌తో సినిమా చూసే ప్రేక్ష‌కుడికి థ్రిల్ క‌లుగుతుంది. స‌స్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. ప్రతి నిమిషం చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. స్క్రిప్ట్ రెడీ చేయ‌డానికి చాలా స‌మ‌యం తీసుకుంటుంది. సినిమాలో తెలంగాణ యాస‌లో మాట్లాడే న‌ర్సింగ్ మ‌క్క‌ల క్యారెక్ట‌ర్ సూప‌ర్బ్‌గా ఉంటుంది. త‌ను ఈ సినిమా కోసం రెండు నెల‌ల్లో పూర్తి ఫిట్‌గా వ‌చ్చాడు. న‌లుగురు కుర్రాళ్లు ఇంద్ర‌, స‌మీర్ ద‌త్త‌, కార్తీక్ రెడ్డి, చ‌క్రి మాగంటి చ‌క్క‌టి పెర్ఫామెన్స్ చేశారు. సురేంద్ర‌గారు అద్భుతమైన విజువ‌ల్స్ ఇస్తే, కార్తీక్ మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాడు. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాం`` అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ ``క‌థ విన‌గానే దీనికి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే కుదిరితే బావుండ‌న‌ని అనుకున్నాం. స్క్రీన్‌ప్లే చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఫైన‌ల్ అవుట్‌పుట్ చూశాం. అంద‌రికీ చాలా కాన్ఫిడెన్స్ ఉంది. వచ్చే నెల విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. స‌హ‌క‌కారం అందించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌`` అన్నారు.

ఇంద్ర మాట్లాడుతూ - ``ఇంత‌కు ముందు రెండు, మూడు సినిమాలు చేశాను. అయితే సూప‌ర్ స్కెచ్ సినిమా చేయ‌డం వ‌ల్ల యాక్ట‌ర్‌గా చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను. డైరెక్ట‌ర్ ర‌విగారు నాకు క‌థ చెప్పి ఫుల్ లెంగ్త్ నెగిటివ్ రోల్ అని చెప్పారు. పూర్తి క్యారెక్ట‌ర్ విన‌గానే చేయ‌గ‌లుగుతానా? అనే సందేహం వ‌చ్చింది. ఎందుకంటే ఇంటెలిజెంట్ నెగ‌టివ్ క్యారెక్ట‌ర్ అది. అయితే ముందుగానే ప్రిపేర్ కావ‌డం వ‌ల్ల అంద‌రం బాగా చేశాం. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

న‌ర్సింగ్ మ‌క్క‌ల మాట్లాడుతూ - ``ర‌విచావ‌లిగారు ఓ మంచి క‌థ‌తో వ‌స్తే నిర్మాత‌లు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ ఓ మంచి క‌థ‌ను న‌మ్మి ముందుకు వ‌చ్చి క‌సితో ప‌నిచేశారు. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్ చేశాను. అయితే రెండు నెల‌ల్లో సిక్స్ ప్యాక్ చేయ‌మ‌ని కండీష‌న్ పెట్టాడు. దాంతో ఛాలెంజ్‌గా తీసుకుని ఒక‌టిన్న‌ర నెల‌లోనే వెయిట్ త‌గ్గాను. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. కోట‌, వేణుమాధ‌వ్ స‌హా మంచి స్టార్ క్యాస్టింగ్ సినిమా ఉంటారు. టాప్ టెక్నీషియ‌న్స్ మా సినిమాకు ప‌నిచేశారు. ఓ మంచి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం. మే నెలాఖ‌రు లేదా జూన్ మొద‌టి వారంలో సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం`` అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఇత‌ర చిత్ర యూనిట్ స‌భ్యులు సినిమా స‌క్సెస్ కావాల‌ని కోరుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడ‌కండ్ల‌, కెమెరా: సురేంద్ర రెడ్డి.టి, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖీ, డాన్స్‌: పోలాకి విజ‌య్‌, స్టంట్స్‌: జాషువా, రామ‌కృష్ణ‌, నిర్మాత‌లు: బ‌ల‌రామ్ మ‌క్క‌ల‌, ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం: ర‌విచావ‌లి.

 

 



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved