01 October 2018
Hyderabad
విజయ్ దేవరకొండ, మెహరీన్ నటించిన చిత్రం `నోటా`. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకుడు. అక్టోబర్ 5న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నోటా పబ్లిక్ మీట్‌లో...
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ - ``విజయ్ ఓ కథను ఒప్పుకున్నాడంటే అందులో కచ్చితంగా కొత్త కోణం ఉంటుంది. రెగ్యులర్ పొలిటికల్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నాను. విజయ్ నిజాయతీగా ఉంటారు. తన ఫస్ట్ సినిమాతోపోల్చితే తనకు ఫ్యాన్స్ పెరిగారు కానీ.. తన ప్రవర్తనలో ఏ మార్పు లేదు. ప్రేక్షకులకు ఏం నచ్చుతుందో అలాంటి కథలనే ఎంచుకుంటూ ఉంటాడు. తనకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ``డైరెక్టర్ ఆనంద్ శంకర్‌కి తెలుగు ఇండస్ట్రీలోకి స్వాగతం. అలాగే తమిళంలో బెంచ్ మార్క్ చిత్రాలను నిర్మించిన నిర్మాత జ్ఞానవేల్ రాజాగారికి అభినందనలు. విజయ్ రెండేళ్ల ముందే తన జర్నీని స్టార్ట్ చేశాడు. అప్పుడు తన దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు. అనే రేంజ్ నుండి ... ఇప్పుడు తను ఏమీ కోల్పోడు అనే రేంజ్‌కి చేరుకున్నాడు. తన ఫినామినా అరుదు. నేను కూడా రౌడీ సి.ఎం కోసం అక్టోబర్ 5న వెయిట్ చేస్తున్నాం`` అన్నారు.
మెహరీన్ మాట్లాడుతూ - ``అక్టోబర్ 5న విడుదలవుతున్న నోటా కోసం చాలా ఎగ్జయిటెడ్‌గా.. రౌడీ సి.ఎం కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ దొరుకుతుందని భావిస్తున్నాం`` అన్నారు.
యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ - ``విజయ్ దేవరకొండ గత చిత్రాల కంటే `నోటా` చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే.. తను తమిళంలో కూడా పెద్ద స్టార్ కావాలని.. అవుతాడని భావిస్తున్నాను`` అన్నారు.
కె.ఇ.జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ - ``విజయ్ దేవరకొండకు ఇక్కడే కాదు.. తమిళనాడులో కూడా చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను నటించిన గీత గోవిందం సినిమాను ఇరవై లక్షలకు కొని తమిళనాడులో విడుదల చేశాం. తొలిరోజునే కోటి పద్దెనిమిది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. బాహుబలి మినహా ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా అయినా.. తెలుగు హీరో అయినా ఒక్కరోజులో కోటి రూపాయలను క్రాస్ చేయలేదు. ఇప్పుడు నోటా కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలాంటి మ్యాజిక్ నెంబర్ వస్తుందో చూడాలి. విజయ్‌కు చాలా హ్యూజ్ క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డి చూసిన తర్వాత తనతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. తను కథ నచ్చి సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అందుకు తనకు థాంక్స్. నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్`` అన్నారు.
కొరటాల శివ మాట్లాడుతూ - ``ఇలాంటి డిఫరెంట్ సినిమా తీసినందుకు జ్ఞానవేల్ రాజాగారికి థాంక్స్. పెళ్ళిచూపులు చూసినప్పుడు విజయ్‌కి ఓ స్క్రిప్ట్ రాద్దామని అనుకున్నా.. అర్జున్ రెడ్డి చూడగానే ఎలాంటి స్క్రిప్ట్ రాయాలో అని భయపడ్డాను. మళ్లీ గీత గోవిందం చూశాను. తనకి ఎలాంటి స్క్రిప్ట్ రాయాలో అర్థం కావడం లేదు. నన్ను కన్‌ప్యూజ్ చేస్తున్నాడు. ఇలా వెర్సటైల్ స్క్రిప్ట్స్‌కు పనిచేయడం విజయ్ ఎంజాయ్ చేస్తున్నారు. తను ఇలాంటి స్క్రిప్ట్ ఇంకా చేయాలి. కచ్చితంగా నేను కూడా మంచి స్క్రిప్ట్‌తో మీ దగ్గరకు వస్తాను. మంచి స్క్రిప్ట్‌కి డిఫరెంట్, ఇన్‌టెన్స్ యాక్టర్ ఎంతో అవసరం. విజయ్ దేవరకొండలాంటి హీరో దొరికినప్పుడు స్క్రిప్ట్‌ను ఎలాగైనా రాయొచ్చు. నోటా యూనిట్‌కి, విజయ్ దేవరకొండకు అభినందనలు.. ఆల్ ది బెస్ట్`` అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ``రెండు రాష్ట్రాలకు ఒకే రౌడీ.. ఒకే పొలిటీషియన్.. ఒకే సీఎం.. అక్టోబర్ 5న నోటా విడుదలైన తర్వాత రెండు రాష్ట్రాలను ఐదు రాష్ట్రాలు చేయాలి. అప్పుడు ఐదు రాష్ట్రాలకు ఒకే సీఎం. ఈ సందర్భంలో నేను కింగ్ ఆఫ్ హిల్ అనే సంస్థ నుండి ప్రొడక్షన్ చేయబోతున్నానని ప్రకటిస్తున్నాను. అది కూడా ఈ సినిమా నుండే ఉంటుంది. ఈ సినిమాకు నిర్మాణంలో భాగస్వామిగా మారాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన జ్ఞానవేల్ రాజాగారికి థాంక్స్. నోటా విషయానికి వస్తే.. నోటా టైటిల్ వల్ల ప్రజలందరూ నోటా బటన్ నొక్కుతారేమో అని.. ఈ సినిమా ఓ పార్టీకి ఫేవర్‌గా ఉంది.. దీన్ని ఆపాలని కొంతమంది కేసులు పెట్టారు. మేం నోటా బటన్ నొక్కాలని చెప్పడం లేదు.. ఏదో ఒక పార్టీకీ ఫేవర్‌గా లేం. అయితే యంగెస్ట్ సీఎం ఆఫ్ హిస్టరీని సినిమాలో చూస్తారు. పవర్ అనేది వాళ్లలో.. వీళ్లలో లేదు. మనలోనే పవర్ ఉంది. ఈ స్టేడియంలో ఉన్నవాళ్లందరూ అనుకుంటే ఎలక్షన్స్‌ని ప్రభావితం చేయాలేమా? ఒక మంచి చేయాలనుకుంటే చేయలేమా? యువతలో పవర్ ఉంది. మనకు ఎవరు ఆడ్మినస్ట్రేషన్ మంచిగా చేస్తున్నారో ఆలోచించి వాళ్లకే ఓటు వేద్దాం. అక్టోబర్ 5న ప్రేక్ష
కులకు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతున్నాను. కంప్లీట్ కొత్త పొలిటికల్ జోనర్‌లో సినిమా ఇవ్వబోతున్నాను. అక్టోబర్ 5న థియేటర్స్‌లో కలుద్దాం`` అన్నారు.