pizza
Kavacham teaser launch
`క‌వ‌చం` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


12 November 2018
Hyderabad

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజల్, మెహరీన్ హీరోయిన్లుగా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో నవీన్ సొంటినేని నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కవచం’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్లు కాజల్, మెహరీన్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు, సంగీత దర్శకుడు థమన్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, నిర్మాత నవీన్ సొంటినేని, దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘శ్రీనివాస్‌గారు చెప్పిన కథ చాలా బాగుంది. ఈ కథ ఓకే అవ్వడానికి ముందు దాదాపు 50 కథలు విన్నాను. అందులో నుంచి ఫిల్టర్ చేసి కొన్ని కథలు నాన్నగారు పంపించారు. అయితే శ్రీనివాస్‌గారు కథ చెప్పిన వెంటనే నాకు నచ్చేసింది. ఒక డిఫరెంట్ జోనర్ సినిమా ఇది. శ్రీనివాస్‌గారు ఈ సినిమా తన ఫస్ట్ సినిమా అన్నట్టు చెయ్యలేదు. ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్ చేసినట్టు చేశారు. ఛోటాగారు మమ్మల్ని ఎంతో అందంగా చూపించారు. థమన్ చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చారు. పాటల గురించి ఇప్పుడు మాట్లాడను. ఆడియో రిలీజ్‌కి మాట్లాడతాను. ఈ సినిమాలో కాజల్, మెహరీన్ క్యారెక్టర్లకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇద్దరూ చాలా అద్భుతంగా చేశారు. మా నిర్మాత నవీన్‌కి ఇది తొలి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. డిసెంబర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

కాజల్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా మంచి కథ. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చాలా ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అలాగే మెహరీన్ క్యారెక్టర్‌కి కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది’’ అన్నారు. మెహరీన్ మాట్లాడుతూ ‘‘ఒక మంచి సినిమాలో నేను కూడా పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ శ్రీనివాస్ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అన్నారు.

ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ శ్రీనివాస్ ఎంతో టాలెంట్ ఉన్న డైరెక్టర్. ప్రతి సీన్‌ని ఎక్స్‌లెంట్‌గా తీశారు. హీరో శ్రీనివాస్‌తో అల్లుడు శీను తర్వాత చేసిన సినిమా ఇది. చాలా అద్భుతంగా నటించాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు.

థమన్ మాట్లాడుతూ ‘‘మ్యూజిక్‌కి మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. డైరెక్టర్ శ్రీనివాస్‌కి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. నాతో మంచి పాటలు చేయించుకున్నారు. హీరో శ్రీనివాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. ఈ సినిమా కూడా అతనికి పెద్ద హిట్ అవుతుంది. ఛోటాగారితో సినిమా అంటే ఎంతో ఛాలెంజింగ్‌గా ఉంటుంది. నా మ్యూజిక్, ఆయన విజువల్స్ ఎప్పుడూ పోటీ పడతాయి. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య అప్పుడప్పుడు సీరియస్‌గా డిస్కషన్స్ కూడా జరుగుతుంటాయి. ఏది ఏమైనా ఈ సినిమాకి మంచి మ్యూజిక్ కుదిరింది’’ అన్నారు.

నిర్మాత నవీన్ సొంటినేని మాట్లాడుతూ ‘‘ఈ కథను సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేసిన హీరో శ్రీనివాస్‌గారికి థాంక్స్. అలాగే ఈ కథ చెప్పగానే మరో మాట లేకుండా ఈ సినిమాలో చేస్తున్నాం అని హీరోయిన్లు కాజల్, మెహరీన్ ఒప్పుకున్నందుకు వారికి థాంక్స్. అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చిన థమన్‌గారికి, ఎక్స్‌లెంట్ విజువల్స్ ఇచ్చిన ఛోటా కె.నాయుడుగారికి, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్‌గారికి, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాగారికి థాంక్స్. ఇక డైరెక్టర్ శ్రీనివాస్ గురించి చెప్పాలంటే సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు’’ అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ మాట్లాడుతూ ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నవీన్‌గారికి, హీరో శ్రీనివాస్‌గారికి థాంక్స్. శ్రీనివాస్‌గారికి ఇది డిఫరెంట్ జోనర్ అని చెప్పాలి. ఇప్పటివరకు పోలీస్ క్యారెక్టర్ ఆయన చెయ్యలేదు. ఈ క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా పోషించారు శ్రీనివాస్. సినిమా ఇంత బాగా రావడానికి నటీనటులు, టెక్నీషియన్స్ సహకారం ఎంతో ఉంది. ముఖ్యంగా థమన్‌గారి మ్యూజిక్, ఛోటాగారి ఫోటోగ్రఫీ సినిమాకి పెద్ద ఎస్సెట్స్ అయ్యాయి. డిసెంబర్‌లో మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ‌రీన్‌, నీల్ నితిన్ ముఖేష్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణె, పోసాని కృష్ణ‌ముర‌ళి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, క‌ల్యాణి న‌ట‌రాజ‌న్‌, ముకేష్ రిషి, స‌త్యం రాజేష్‌, అజ‌య్, శ్ర‌వ‌ణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామ‌జోగ‌య్య‌శాస్త్రి, చంద్ర‌బోస్‌, శ్రీమణి, ఫైట్స్: క‌న‌ల్ క‌న్న‌న్‌, స్ట‌న్ శివ‌, విజ‌య్‌, ర‌వివ‌ర్మ‌, రాంబాబు, కొరియోగ్ర‌ఫీ: శోభి, మాట‌లు: అబ్బూరి ర‌వి, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, ఆర్ట్‌: చిన్నా, సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, కెమెరా: ఛోటా కె.నాయుడు, స‌హ నిర్మాత‌: చాగంటి శాంత‌య్య‌, నిర్మాత‌: న‌వీన్ శొంఠినేని(నాని), క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: శ్రీనివాస్ మామిళ్ళ‌.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved