pizza
Paper Boy teaser launch
"పేపర్ బాయ్" టీజర్ విడుదల చేసిన రియల్ పేపర్ బాయ్ !!
You are at idlebrain.com > News > Functions
Follow Us


21 July 2018
Hyderabad

The teaser of ‘Paper Boy’ was unveiled by real paper boy at the launch event held on Saturday.

Speaking first director Jaya Shankarr said,
“After watching my short-film director Sampath Nandi offered to director a feature film and I can’t thank him enough for this opportunity. This is a simple love story and hope audience will like it. We are planning for August release.”

One of the producers Narasimha said, “We had a good script and a team. I’m sure the film will be a success.

Director Sampath Nandi said,
“It’s a simple love story with a lot of emotions. I would like to thank Soundar Rajan for his extraordinary cinematography and Bheems for his music.”

Hero Santosh Shoban said,
“With ‘Golconda High School’ I made my debut as child artist and with this film I’m getting introduced as hero. ‘Thank you’ is a small word for director Sampath Nandi and his encouragement is unmatchable. This film has a lot of newcomers and heroine Riya Suman performed quite well. ‘Paper Boy’ has come out well and hope audience will like it.”

Cast: Santosh Shoban, Riya Suman, Tanya Hope, Posani Krishna Murali, Abhishek Maharshi, Vidyu Raman, Jayaprakash Reddy, Bithiri Sathi, Sunny, Mahesh Vitta and others

Crew:
Director: Jaya Shankarr
Producers: Sampath Nandi, Ramulu, Venkat and Narasimha
Banners: Sampath Nandi Team Works, BLN Cinema and Prachitra Creations
Music: Bheems Ceciroleo
Cinematography: Soundar Rajan
Editor: Tammiraju
Art Director: Rajeev
Executive Producer: Murali Mamilla
Script co-ordinator: Sudhakar Pavuluri
PRO: VamsiShekar

"పేపర్ బాయ్" టీజర్ విడుదల చేసిన రియల్ పేపర్ బాయ్ !!

సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో సంపత్ నంది నిర్మాతగా ప్రచిత్ర క్రియేషన్స్, బి ఎల్ ఎన్ సినిమా సంయుక్తంగా జయశంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "పేపర్ బాయ్". సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం టీజర్ ను శనివారం ఉదయం రియల్ పేపర్ బాయ్ అఖిల్ చేత విడుదల చేయించారు.

ఈ సందర్భంగా దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ..
"నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి సంపత్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. కథ విషయానికి వస్తే.. సింపుల్ లవ్ స్టొరీ. ఆగస్టు నెలలో మీ ముందుకు వస్తుంది. తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నా" అన్నారు.

హీరోయిన్ రియా మాట్లాడుతూ..
"నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు, సంపత్ గారికి నా కృతఙ్ఞతలు. సక్సెస్ అవుతందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నా" అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన నరసింహ మాట్లాడుతూ..
"మంచి స్క్రిప్ట్.. అందరూ బాగా వర్క్ చేశారు.విజయం అవుతుందని ఆశిస్తున్నా" అన్నారు.

సంపత్ నంది మాట్లాడుతూ..
"సింపుల్ లవ్ స్టొరీ... మన ఇంట్లో ఒక అమ్మాయి పేపర్ బాయ్ కు మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. కానీ అన్నీ ఎమోషన్స్ ఉంటాయి.. మంచి విజువల్స్ అందించారు కెమెరామెన్ సౌందర్య రాజన్. అలానే బీమ్స్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. వీరిద్దరికీ నా కృతజ్ఞతలు. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా కనుక అనదరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఆగస్టు నెలలో విడుదల చేస్తున్నాము" అన్నారు.

హీరో సంతోష్ మాట్లాడుతూ..
"గోల్కొండ హై స్కూల్ తో చైల్డ్ ఆర్టిస్టు గా ఆదరించారు.. ఇప్పుడు పేపర్ బాయ్ గా మీ ముందుకు వస్తున్నా. ఆదరించాలని కోరుకుంటున్నా. ఇక ఈ సినిమాలో అందరూ కొత్తవారే. మమ్మల్ని నమ్మి ప్రోత్సహించిన సంపత్ నంది గారికి థాంక్స్ అనే మాట చాలా చిన్నది. ఈ సినిమాకు హైలెట్ సినిమాటోగ్రఫీ. మ్యూజిక్ కూడా బెస్ట్ గా నిలుస్తుంది. రియా బాగా నటించింది. సినిమా అద్భుతంగా వచ్చింది, అందరికీ నచ్చి తీరుతుందని ఆశిస్తున్నా" అన్నారు.

ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో అభిషేక్ మహర్షి, రాజశ్రీ, దివ్య, మురళి, మహేష్ మిట్టల్, సన్నీ, రామ్ సుంకర్, సుధాకర్ పావులూరి, వెంకట్, నరసింహ తదితరులు హాజరయ్యారు.

సంతోష్ శోభన్, రియా, తాన్యా , పోసాని కృష్ణ మురళి, బిత్తిరీ సత్తి, విద్యుల్లేక, జయప్రకాష్ రెడ్డి, సన్నీ, మహేష్ మిట్ట, రాజశ్రీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌందర్య రాజన్, మ్యూజిక్: బీమ్స్, ఆర్ట్: రాజీవ్, ఎడిటర్: తమ్మి రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళి మామిళ్ల, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, ఫైట్స్: రాము సుందర్ నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ, కథ -స్క్రీన్ ప్లే- మాటలు: సంపత్ నంది, డైరెక్టర్: జయశంకర్.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved