pizza
Paper Boy song launch
ఆగస్ట్‌ 31న 'పేపర్‌ బాయ్‌'
You are at idlebrain.com > News > Functions
Follow Us


22 August 2018
Hyderabad

సంపత్‌ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్‌, బి.ఎల్‌.ఎన్‌ సినిమా పతాకాలపై సంపత్‌ నంది, వెంకట్‌, నరసింహ నిర్మించిన సినిమా 'పేపర్‌ బాయ్‌'. సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌ , తన్య హోప్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్‌ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 7న విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినా.. తాజాగా సినిమా ప్రీ పోన్‌ అయ్యింది. ఆగస్ట్‌ 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా రోడ్‌ ట్రిప్‌ను ప్లాన్‌ చేసిన చిత్ర యూనిట్‌ ఈరోజున రోడ్‌ ట్రిప్‌ను స్టార్ట్‌ చేశారు. ఈ వివరాలను వెల్లడించడానికి గురువారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. అందులో భాగంగా టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ టైటిల్‌ సాంగ్‌ను ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌ పాడటం విశేషం. పాటను రాసిన కాసర్లశ్యామ్‌ పాటను రిలీజ్‌ చేశారు.

కాసర్ల శ్యామ్‌ మాట్లాడుతూ - ''ఈ పాట విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. ఎందుకంటే.. కాసర్లశ్యామ్‌ అంటే ఓ తరహా పాటలకే పరిమితం అని అనుకునేవారు. కానీ సంపత్‌నందిగారు, భీమ్స్‌గారు నా స్టయిల్‌ను మార్చడానికి సంకల్పించి ఇలాంటి పాటను నాకు ఇచ్చారు. నాకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన చంద్రబోస్‌గారు ఈ పాటను పాడటం విశేషం. ఆయన మా కోరికను మన్నించి ఈ పాట పాడినందుకు ఆయకు కృతజ్ఞతలు'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ భీమ్స్‌ సిసిరోలియో మాట్లాడుతూ - ''ఈ నెల 31నే సినిమా విడుదలవుతుంది. మాలాంటి ఎందరికో ఉత్తేజాన్ని కలిగించిన చంద్రబోస్‌గారు అడగ్గానే కాదనకుండా పాటను పాడారు. ఎంటైర్‌ యూనిట్‌ను అభినందించారు'' అన్నారు.

హీరో సంతోశ్‌ శోభన్‌ మాట్లాడుతూ - ''మా కోరికను మన్నించి పాట పాడిన చంద్రబోస్‌గారికి థాంక్స్‌. ఆగస్ట్‌ 31న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం'' అన్నారు.

చిత్ర నిర్మాత సంపత్‌ నంది మాట్లాడుతూ - ''ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కాసర్లశ్యామ్‌గారు మంచి అర్థవంతమైన సాహిత్యంతో పాటను రచించారు. చంద్రబోస్‌గారు పాటను అద్భుతంగా పాడారు. పేపర్‌, పేపర్‌బాయ్స్‌ ఉన్నంత కాలం ఈ పాట నిలిచిపోతుంది. సెప్టెంబర్‌ 7న సినిమాను విడుదల చేద్దామని అనుకున్నాం. అయితే శైలజారెడ్డి అల్లుడు వెనక్కి వెళ్లడం.. డిస్ట్రిబ్యూటర్స్‌ కోరిక మేర సినిమాను ఆగస్ట్‌ 31న విడుదల చేస్తున్నాం. అలాగే ఈరోజు నుండి రోడ్‌ ట్రిప్‌ ఉంటుంది. ఇందులో యూనిట్‌ అందరూ వచ్చి మీ ఇంటికి పేపర్స్‌ వేస్తారు. మీతో ముచ్చటిస్తారు'' అన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved