సుమంత్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్‌గా నటించిన చిత్రం `సుబ్రహ్మణ్యపురం`. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. సుమంత్, అక్కినేని అఖిల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
అక్కినేని అఖిల్ మాట్లాడుతూ - ``ఇలాంటి కథ దొరకడం అంత సులభమేమీ కాదు. సుమంత్ అన్నకు దొరికింది. కంటెంట్ బేస్‌డ్ సినిమాను ఎంకరేజ్ చేస్తున్న నిర్మాతలకు అభినందనలు. హీరోయిన్ ఈషాకు ఆల్ ది బెస్ట్. ట్రైలర్‌ను చూడగానే.. ఏదో భయపెట్టాలనే ఉద్దేశంతో కాకుండా ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించారనిపించింది. దర్శకుడు సంతోష్‌కు థాంక్యూ. సుమంత్ అన్నంటే నాకు చాలా ఇష్టం`` అన్నారు.
సుమంత్ మాట్లాడుతూ - ``దర్శకుడు సంతోష్ మూల కారణం. నా గత చిత్రం మళ్ళీరావాలో నా పేరు కార్తీక్. ఈ చిత్రంలో కూడా నా పేరు కార్తీక్. ఇది కూడా బాగానే ఆడుతుందనే నమ్మకం ఉంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథలు నాకు పెద్దగా ఎక్కవు. సంతోష్ కథ చెబుతానని అనగానే సరే! విందాం లే అని అనుకున్నాను. రెండున్నర గంటలు కథ వినగానే చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిచింది. సినిమా నెరేషన్‌లో 80 శాతం చెప్పినట్లు తీస్తే హిట్ అవుతుందని చెప్పాను. సినిమా రెడీ అయిపోయింది. దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించాడు. చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే సినిమా విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నాం. అందరి ఆశీర్వాదాలు కావాలి`` అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ``ఈ బ్యానర్‌లో వస్తున్న తొలి చిత్రమిది. నిర్మాత సుధాకర్ రెడ్డిగారు నాకు మంచి మిత్రులు. సినిమాలకు దాదాపు దూరంగా ఉంటారు. కార్తికేయ, గరుడవేగ వంటి సినిమాలకు వెనుక ఉండి ప్రోత్సాహం అందించారు. ఇప్పుడు ఆయన చేసిన మరో సినిమాయే ఇది. తప్పకుండా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ - ``డైరెక్టర్ సంతోష్ కథ చెప్పగానే.. థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే నేను సినిమా చేయడానికి ఓకే అన్నాను. సెట్స్‌లో చాలా క్లియర్‌గా ఉండి అనుకున్న అవుట్‌పుట్ రాబట్టుకున్నారు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుధాకర్‌గారికి అభినందనలు. సుమంత్‌గారి సినిమాలంటే ఇష్టపడతాను. డిసెంబర్ తొలి వారంలో సినిమా విడుదలవుతుంది`` అన్నారు.
నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ - ``మంచి కథ.. డైరెక్టర్ సంతోష్ చక్కగా తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో సినిమాను మూడు నెలల్లోనే పూర్తి చేశాం. మరో నెలలో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేశాం. కార్తికేయ కంటే సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను`` అన్నారు.
దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ - ``నిర్మాత సుధాకర్‌రెడ్డిగారే ఈ సినిమాకు కర్త కర్మ క్రియ. వర్క్ పరంగా ఎలాంటి ప్రెజర్ లేకుండా చూసుకుని.. సినిమా బాగా రావడంలో ఎంతగానో తోడ్పడ్డారు. ఆ విషయంలో సుధాకర్‌గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. షార్ట్ ఫిలింస్ చేసిన నాకు చాలా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. అలాంటి సమయంలో సుధాకర్ గారు నాకు వెన్నంటే ఉండి సపోర్ట్ చేశారు. హీరో సుమంత్‌గారు నాకు థ్రిల్లర్స్ పెద్దగా ఎక్కవు అని ముందే చెప్పారు. అయితే ప్రతి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పారు. నేను రెండున్నర గంటలు కథ నెరేట్ చేశాను. కథ నన్ను ఆకట్టుకుంది. సినిమా చేస్తున్నామని తొలి సిట్టింగ్‌లోనే సుమంత్ చెప్పారు. ఈషాగారు ఒకరోజు సమయం తీసుకుని ఓకే చెప్పారు. కార్తికేయ సీక్వెల్‌లా అనిపించొచ్చు కానీ కాదు.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే పాయింట్ తప్ప.. కార్తికేయ సినిమాకు దీనికి సంబంధం లేదు. డిఫరెంట్ సబ్జెక్ట్. మిస్టక్ థ్రిల్లర్. డివోషనల్ థ్రిల్లర్. అనుగ్రహించే దేవుడే అగ్రహిస్తే పరిస్థితేంటి? అనేదే కాన్సెప్ట్. కార్తీక్ వర్సెస్ గాడ్. కొత్తగా ఉంటుంది. మా నిర్మాతగారు, శివకుమార్‌గారు ఇచ్చిన విలువైన సలహాలతో సినిమాను చక్కగా చేయగలిగాం. సురేష్‌గారు, సాయికుమార్‌గారు, అలీగారు .. అందరూ మంచి పాత్రల్లో కనపడతారు. శేఖర్ చంద్ర అద్భుతమైన పాటలు, ఆర్ ఆర్ అందించారు. సినిమాటోగ్రాఫర్ ఆర్.కె.ప్రతాప్ చక్కటి విజువల్స్ అందించారు. సపోర్ట్ అందించిన ప్రతి ఒక ఆర్టిస్ట్ టెక్నీషియన్‌కి థాంక్స్`` అన్నారు.