16 January 2025
Hyderabad
Gandhi Tatha Chettu, featuring Sukumar Bandreddi’s daughter Sukriti Veni Bandreddi in the lead role, will be released in theatres on January 24th. Directed by Padmavati Malladi, the film is produced by Mythri Movie Makers, Sukumar Writings, and Gopi Talkies. Tabitha Sukumar is presenting the movie, while Naveen Yerneni, Yalamanchili Ravishankar, and Shesha Sindhu Rao have jointly produced it.
Today, the film's team interacted with the media in Hyderabad. Speaking at the Rachabanda event, director Sukumar said that his daughter is fond of singing. "She started singing in Standard IX. Having seen her being playful at home, I didn't believe she had acting range. At first, I declined to let her act in this movie. When Gandhi Tatha Chettu came her way, I had my share of doubts. Since Padmavati akka insisted, I let her give a narration. When I saw the first clip of Sukriti's performance, I was pleasantly surprised. I expect the artists in my films to possess excellent acting abilities. I spend months zeroing in on artists. The casting process for Rangasthalam and Pushpa went on for 8-9 months. I expect my artists to be versatile. Sukriti surprised a person like me. I won't shy away from boasting that my daughter has performed so well. Producer Sindhu Rao toiled a lot to complete the film somehow. Director Padmavati akka wrote the script in such a way that I was hooked to her narration. I have always believed that those who are good at narration can execute good films without fail. When I narrated Arya script to Chiranjeevi garu, Allu Aravind garu asked him if an inexperienced person like me would be able to execute the project. Chiranjeevi garu told him that I will direct it efficiently because my narration was effective."
Sukumar added, "Padmavati akka will go places without an iota of doubt. I thank her for casting my daughter. I will be indebted to her. Lavanya, who has played my daughter's mother in the movie, has performed so well. In a lighter vein, it pinched me seeing my daughter address someone else as her parents in the film (laughs). Entertainment is my message. When I used to write poetry much before I entered the film industry, I would be a sensitive person. When I was new to the industry, someone said that the commercial field doesn't suit me. I went to my guru, who told me anything that involves investment is business. He inspired me to think about entertaining others. I made it my purpose to entertain others, to bring them happiness. But if entertainment is matched with a message, it's a bonus. This is why I am jealous of those who have made Gandhi Tatha Chettu. Make this a Rs 100 Cr movie! The Trailer of Gandhi Tatha Chettu has so much feel. It feels like Nature. This film must work for Sindhu and Paddu akka, not even for Sukriti."
Tabitha Sukumar said that she was not confident about her daughter's acting skills at first. "It is the director who trusted Sukriti's abilities. I must thank Mythri Movie Makers and my husband on this occasion for bringing the film out before the audience. Since our film received appreciation in the festival circuit, I wished for a theatrical release. It is becoming a reality. I urge the audience to encourage Gandhi Tatha Chettu." Tabitha turned emotional talking about her daughter's journey.
The film has already been screened at several international film festivals, winning multiple awards. Sukriti Veni also received the Best Child Artist award for her performance.
The cast of Gandhi Tatha Chettu includes Sukriti Veni, Anand Chakrapani, Raghuram, Bhanu Prakash, Nehal Anand Kunkuma, and Rag Mayur. The music is composed by Re, while cinematography is handled by Srijith Cheruvupalli and Vishwa Devabattula. Editing is by Harishankar TN, and the lyrics are written by Suddala Ashok Teja, Kasarla Shyam, and Vishwa. The production design is by V. Nani Pandu, with Ashok Bandreddy as the co-producer and Abhinay Chilukamarri as the executive producer. The film is written and directed by Padmavati Malladi.
గాంధీ తాత చెట్టు సుకృతి జీవితంలో మంచి జ్ఞాపకంలా ఉంటుంది: జీనియస్ దర్శకుడు సుకుమార్
దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం యూనిట్ బుధవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సుకమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసమావేశంలో
సుకుమార్ మాట్లాడుతూ '' సుకృతికి చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే చాలా ఇష్టం. తనకు నటన మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ దర్శకురాలు పద్మ, నిర్మాతల్లో ఒకరైన సింధు యాక్టింగ్‌కు ఒప్పించారు. ఈ ఇద్దరిది సినిమా విషయంలో ఎంతో పెద్ద జర్ని. సుకృతి నటిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు నమ్మకం లేదు. కానీ దర్శకురాలు పద్మని అడిగితే మాత్రం బాగా నటిస్తుంది అని చెప్పేది. మెహమాటానికి సినిమా చేయకు అని చెప్పాను. కానీ సుకృతి యాక్టింగ్ చూసిన తరువాత షాక్ అయ్యాను. అంత బాగా నటించింది. నా కూతురు ఈ సినిమాలో బాగా చేసింది అని చెప్పడానికి నేను ఏ మాత్రం సందేహించను. ఈ సినిమాను పద్మ, సింధులు ఎంతో కష్టపడి పట్టుదలతో పూర్తిచేశారు. కథ బాగా చెప్పగలిగితే సినిమా బాగా తీయగలరు. దర్శకురాలు కథ బాగా చెప్పింది అదే విధంగా ఈ సినిమా అంతే సూపర్‌గా తెరకెక్కించింది. ఈ సినిమా సుకృతి లైఫ్‌లో ఒక మంచి జ్ఞాపకంలా మిగిలిపోతుంది. సినిమాలో అందరూ బాగా నటించారు. నవీన్, రవి గారు ఈ సినిమాను నిర్మించడం, విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మూడు గంటలు మనుషులను కూర్చొబెట్టి ఎంటర్‌టైన్ చేయగలిగితే ఆ మూడు గంటలు క్రైమ్ తగ్గిపోతుందని భావిస్తాను. ఎంటర్‌టైన్‌మెంటే మేసేజ్‌గా ఫీలవుతున్నాను. సినిమా అంటే బిజినెస్.. ఇన్వెస్ట్ చేసిన ఏదైనా బిజినెసే.. సినిమా కూడా అంతే.. ప్రేక్షకులను ఆనందిపంజేయడం, ఆనందింప జేయడమే నా దృష్టిలో సందేశమే. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మేసేజ్ ఇచ్చే సినిమా చేయడం అదృప్టం. గాంధీ తాత చెట్టులో ఈ రెండూ ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను' అన్నారు.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ '' సినిమా చూసిన తరువాత ఇంటెన్సిటి... సినిమాల్లో అందరి నటన చూసి ఇది డబ్బులు తెచ్చే సినిమా అనిపించింది.ముఖ్యంగా సుకృతి నటన చాలా బాగా చేసింది. పెద్ద ఆర్టిస్ట్‌లా, అనుభవం ఉన్న ఆర్టిస్ట్‌లా సుకృతి చేసింది. అందరికి చిన్నారి చేతన, లిటిల్‌సోల్జర్స్ సినిమాలను గుర్తుచేస్తుంది. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతో కలిసి చూడాలి. అందరి హృదయాలను హత్తుకునే సినిమా ఇది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్‌లో రీచ్ అవుతుంది అనే నమ్మకం ఉంది అన్నారు.
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ '' ఈ సినిమాను ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా చూశాను. ఈ సినిమా నాకెంతో బాగా నచ్చింది. సుకృతి పర్‌ఫార్మెన్స్ ఎక్స్‌టార్డనరీగా ఉంది. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది అన్నారు.
సమర్పకురాలు తబితా సుకుమార్ మాట్లాడుతూ '' సుకృతి ఇంత బాగా నటిస్తుందని నాకు తెలియదు. తాను మంచి సింగర్ అని తెలుసు కానీ నటిస్తుందని అనుకోలేదు. ఈ సినిమాను ఫెస్టివల్స్‌కు వెళితే చాలు అనుకున్నాను. అవార్డులు వచ్చిన తరువాత అందరూ అప్రిషియేట్ చేస్తుండటం చూసి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి సపోర్ట్‌తో విడుదల చేస్తున్నాం. సుకృతిలోని నటనను పద్మ వెలికి తీసింది. తొలిరోజు సుకృతి నటన చూసి ఎంతో ఆనందంగా ఫీలయ్యాను. సినిమాలో మిగతా నటీనటులు కూడా బాగా చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాను ఎన్నో సార్లు చూశాను. చూసిన ప్రతిసారి ఏడుస్తూనే ఉన్నాను. టీన్స్‌లో వున్న తను సినిమా కోసం హెయిర్ షేవ్ చేసుకుంది. నాకు ఎంతో బాధేసింది ( భావోద్వేగానికి లోనయ్యారు). సుకృతి మల్టీ టాలెంటెడ్.. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.
దర్శకురాలు పద్మావతి మాట్లాడుతూ '' ఒక చెట్టుకు, మనిషికి మధ్య ఉన్న అనుబంధంతో ఈ సినిమా ఉంటుంది. సుకృతి నటన ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా విషయంలో సుకుమార్, తబితా సుకుమార్ ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. ఈ సినిమా విడుదల తరువాత 'గాంధీ'గా సుకృతి నటన చూసిన తరువాత అందరికి ఆమెపై మంచి గౌరవం ఏర్పడుతుంది అన్నారు.
సుకృతి బండ్రెడ్డి మాట్లాడుతూ '' ఈ సినిమాను ఎంతో కంఫర్టబుల్‌గా చేశాను. దర్శకురాలు పద్మ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది. ఆమె కోసమే నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను. ఈ సినిమా కోసం నాన్న ఎటువంటి సలహాలు ఇవ్వలేదు. ఈ సినిమాలో అందరితో ఎంతో కంఫర్ట్‌గా నటించాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన అందరికి నా థాంక్స్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సింధు, రీ, ఆనంద్ చక్రపాణి, లావణ్య, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
|