pizza

“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta

Article #6: Shankar Mahanthi
ఆర్టికల్ #6: శంకర్ మహంతి

You are at idlebrain.com > news today >

21 August 2025
Hyderabad

“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta


Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.

మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.

Don’t encourage piracy. Please watch #Mayasabha only on SonyLiv

In 1970, a 9-year-old boy saw himself in child actor Master Prabhakar from Bapu’s film Balaraju Katha. He dreamed of earning a name like that and bringing joy to his parents. As he grew up, he began acting in school plays and aspired to become a character actor like Kaikala Satyanarayana. In college, along with drama, he also won awards in Kuchipudi dance and eventually declared at home that he wanted to enter films.

Despite having four children and having lost 80% function in one leg, his father—who ran a small business—didn't deny his 20-year-old son’s wish and sent him to Madras. Two years passed just trying to get by. Without a godfather in the industry, he believed his father was his God—but dreams turned to disappointment, and he returned home.

At 22, he was married off and made a householder (as per the classic Shivareddy dialogue) and was told: "ఈ ఇంట్లో అన్నిటికీ నువ్వే పెద్దవై పోయావ్. కుటుంబం ఎలా నడపాలో నువ్వే చెప్పు" (You’re the eldest in the house. Take charge and show us how to run the family)

After fulfilling his responsibilities and repaying his parents’ debt, he moved to Hyderabad at the age of 49. Welcomed by the mother goddess of cinema, he began his film journey at 40 with Bheemili Kabaddi Jattu and continued it for 10 years. At 59, he played roles in films like Narappa, Acharya, Gaami, and Dasara. And now, at 64, he has arrived as “Bombula Shivareddy” in Mayasabha.

55 years of cinematic illusion.

The dream of a 9-year-old boy—who lived and breathed cinema—finally came true with Mayasabha.

Some brilliant improvs by Mahanti garu in Mayasabha:

1. Episode 3, after the bomb blast:
Before setting off with armed men to destroy even the last insect in his rival’s house, he faces criticism from his son MSR. Just before getting into the jeep, the way he lifts his hand and says “Chee!” (an expression of disgust) — that hand gesture was a powerful, authentic moment.

2. Episode 3, Sare scene:
The way he delivered the line “Tirapatendira! Shock meeda shock icchandavoo!” (Translation: “What a twist! You gave me a shock on top of a shock!”) always draws laughter.

Mahanti garu’s heartfelt thanks from his ashram to the Mayasabha team and audience:

"జరుగవలసినది జరిగియే తీరును - ఎవరెంత అడ్డుకున్నను ఆగదు, జరుగకూడనిది జరుగనే జరుగదు - ఎవరెంత యత్నించినను జరుగదు. ఇది సత్యము. కనుక ఊరక ఉండుటయే ఉత్తమము... అనే సందేశాన్ని ఆచరిస్తున్న తన బిడ్డ కలను, నిష్కల్మ హృదయులు శ్రీ దేవా గారి మదిలో మెదిలి శివారెడ్డిగా పురుడు పోయించి, విజయ్ గారితో బారసాల చేయించి, కిరణ్ గారితో మాటలు నేర్పించి, తోటి నటులతో ఆటలు ఆడించి, Sony Liv వారితో ప్రసారం చేయించి, ప్రేక్షకాదరణ పొంది, ప్రశంసలు కురిపిస్తున్న నా తండ్రి అరుణాచల రమణ మహర్షి పాదాలను, ఆనంద భాష్పాలతో అభిషేకించగలనే తప్ప ఇంకేమి ఇవ్వగలను అరుణాచల 🙇‍♂️🙇‍♂️🥲🥲🥲🪷😊🙏” (What must happen will happen—no matter who tries to stop it. What must not happen will never happen—no matter who tries to force it. This is the truth. Therefore, staying still is best. This dream was born in the pure-hearted Deva’s mind, brought to life as Shivareddy, named by Vijay garu, given words by Kiran garu, played with fellow actors, aired by Sony Liv, and now receiving audience love and praise. What more can I offer but tears of joy at the feet of my father, Arunachala Ramana Maharshi? 🙇‍♂️🙇‍♂️🥲🪷😊🙏)

Having spent decades chasing the right opportunity to express his talent, Mahanti garu decided that Mayasabha would be his final attempt. After the shoot wrapped, he returned to his ashram with his wife.

But now… opportunities are chasing him!

The film world is calling him back!

Visitors to the ashram are discussing Mayasabha with him, asking for selfies.

Mahanti garu will return.

He will enchant us in many more brilliant roles!

To learn more about Mahanti garu, watch this YouTube link:
https://youtu.be/4v9WtzCnpg8?feature=shared

Kudos to Mahanthi gaaru and his passion for cinema! – “Every person is a walking story.”

Don’t encourage piracy. Please watch #Mayasabha only on SonyLiv

“ప్రతి మనిషీ నడయాడే కథ!” – ఆర్టికల్ #6: శంకర్ మహంతి

1970 లో బాపు గారి "బాలరాజు కథ" సినిమాలో బాల నటుడు మాస్టర్ ప్రభాకర్ లో తనను చూసుకున్న 9 సం.ల పిల్లాడు, తను కూడా అలా పేరు తెచ్చుకుని అమ్మానాన్నలకు ఆనందం పంచాలని సంకల్పించుకున్నాడు. కుర్రాడయ్యాక స్కూలులో నాటికలు వేస్తూ, కైకాల సత్యనారాయణ గారిలా కేరక్టర్ యాక్టర్ కావాలని కోరుకున్నాడు. కాలేజీలో చేరి నాటికలతో పాటు, కూచిపూడి నృత్యంలో కూడా బహుమతులు పొంది, సినిమాల్లోకి వెళతానని ఇంట్లో డిక్లేర్ చేశాడు. 4 గురు పిల్లలతో, కుడికాలు 80% కోల్పోయిన తండ్రి చిన్న వ్యాపారం చేసుకుంటూ, 20 సం.ల కొడుకు మాట కాదనక మద్రాసు పంపారు. రాకపోకలతోనే రెండు సంవత్సరాలు గడిచాయి. గాడ్ ఫాదర్ లేని వారికి గాడ్డే ఫాదర్ అని, ఫాదర్ నే గాడ్ గా భావించి, నేర వేరని ఆశతో నిరాశగా తండ్రి వద్దకు వచ్చేశాడు. 22 ఏళ్లకే పెళ్ళి కొడుకుని చేసి, మేనకోడలికిచ్చి ఇంటివాడిని చేసి (మన శివారెడ్డి డైలాగ్) "ఈ ఇంట్లో అన్నిటికీ నువ్వే పెద్దవై పోయావ్. కుటుంబం ఎలా నడపాలో నువ్వే చెప్పు" అంటూ బాధ్యతలు అప్పజెప్పేశారు.

తన తల్లిదండ్రుల ఋణం తీరాక, 49 సం.ల మధ్యవయసులో హైదరాబాద్ చేరారు. సినిమా కళామతల్లి ఒడిలోకి తీసుకుని, 40 ఏళ్ళకి చేరావా అంటూ "భీమిలీ కబడ్డీ జట్టు" తో తన ప్రయాణాన్ని 10 ఏళ్లపాటు కొనసాగించి, 59 సంవత్సరాలకు "నారప్ప", "ఆచార్య" "గామి", "దసరా" వంటి చిత్రాల్లో దొరికిన పాత్రలు చేసుకుంటూ 64 సంవత్సరాలకు “బాంబుల శివారెడ్డి”గా "మయసభ" లో తేలారు. 55 ఏళ్ల పాటు సినీ-మాయే. ఆశ, శ్వాస, ధ్యాసగా జీవిస్తున్న 9 సంవత్సరాల పిల్లవాడి కల మయసభతో నెరవేరింది.

మయసభలో మహంతి గారు చేసిన కొన్ని అద్భుతమైన ఇంప్రూవ్స్:

1. మూడో ఎపిసోడ్ లో బాంబ్ బ్లాస్ట్ తరువాత..తన ప్రత్యర్థి ఇంట్లో పురుగు కూడా మిగలకుండా చేస్తానని మంది మార్బలంతో బయల్దేరేముందు, తన కొడుకు MSR నుంచి విమర్శనెదుర్కున్నప్పుడు, జీప్ ఎక్కే ముందు తాను చేయి లేపి “ఛీ” అంటూ చేసిన ఒక హ్యాండ్ జెస్చర్ ఒక అద్భుతమైన ఆథెంటిక్ మొమెంట్.

2. మూడో ఎపిసోడ్ సారె సీన్: “తిరపతెందిరా షాక్ మీద షాకిచ్చాండావో” అనే డైలాగ్ తాను చెప్పిన విధానం చూసిన ప్రతిసారీ నవ్వులు కురిపిస్తుంది.

మయసభ యూనిట్ కి ప్రేక్షకులకు ఆశ్రమం నుంచి మహంతిగారు పంపిన కృతజ్ఞతలు: "జరుగవలసినది జరిగియే తీరును - ఎవరెంత అడ్డుకున్నను ఆగదు, జరుగకూడనిది జరుగనే జరుగదు - ఎవరెంత యత్నించినను జరుగదు. ఇది సత్యము. కనుక ఊరక ఉండుటయే ఉత్తమము... అనే సందేశాన్ని ఆచరిస్తున్న తన బిడ్డ కలను, నిష్కల్మ హృదయులు శ్రీ దేవా గారి మదిలో మెదిలి శివారెడ్డిగా పురుడు పోయించి, విజయ్ గారితో బారసాల చేయించి, కిరణ్ గారితో మాటలు నేర్పించి, తోటి నటులతో ఆటలు ఆడించి, Sony Liv వారితో ప్రసారం చేయించి, ప్రేక్షకాదరణ పొంది, ప్రశంసలు కురిపిస్తున్న నా తండ్రి అరుణాచల రమణ మహర్షి పాదాలను, ఆనంద భాష్పాలతో అభిషేకించగలనే తప్ప ఇంకేమి ఇవ్వగలను అరుణాచల 🙇‍♂️🙇‍♂️🥲🥲🥲🪷😊🙏”

దశాబ్దాలుగా తన టాలెంట్ ని ఆవిష్కరించే సరైన అవకాశాల కోసం వెతుకుతూ అలిసి పోయిన మహంతి గారు, #మయసభ తన చివరి ప్రయత్నమని నిర్ణయించుకుని, షూటింగ్ అవగానే సతీ సమేతంగా ఆశ్రమానికి వెళ్లి పోయారు! ఇప్పుడు అవకాశాలే ఆయన కోసం వెతుకుతున్నాయి! సినీ ప్రపంచం రమ్మని పిలుస్తోంది! ఆశ్రమానికి వచ్చిన వారు కూడా తనతో మయసభ చర్చలే జరుపుతున్నారు. సెల్ఫీలడుగుతున్నారు. మహంతి గారు తిరిగి వస్తారు. మరెన్నో అద్భుతమైన పాత్రల్లో మనల్ని అలరిస్తారు!

మహంతి గారి గురించి మరి కొంత తెలుసుకోవాలంటే, ఈ యూట్యూబ్ లింక్ చూడండి: https://youtu.be/4v9WtzCnpg8?feature=shared

బిగ్ సెల్యూట్ టు శంకర్ మహంతి గారు! - “ప్రతి మనిషీ నడయాడే కథ!”

పైరసీ ని అరికట్టండి. సోనీ లివ్ లో “మయసభ” చూడండి!

- Deva Katta

Other articles from "Mayasabha - Every Person is a Walking Story series:

5.Sai Kumar
4.Shatru
3.Tanya Ravi Chandran
2.Chaitanya Rao
1.Aadhi Pinisetty



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved