“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta
Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.
మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.
Bhavana never imagined herself becoming an actor. It wasn’t part of the plan. Her early motivation was simple: financial independence. She wanted to earn early in life, which led her to pursue Chartered Accountancy—one of the few fields where one could begin earning as early as 18 through an internship. Bhavana worked hard, cleared her CA exams, and landed a job at Ernst & Young as a tax consultant. She genuinely liked her job, appreciated the stability it provided, and took pride in what she did. But despite all that, there was something missing. She didn’t wake up every day with a sense of excitement or purpose.
In 2019, she made a New Year’s resolution—to try something new. She gave salsa a shot for a few days but quickly realized it wasn’t for her. Around the same time, a friend who was involved in theatre suggested she try that instead. This led her to connect with Ratna Shekar, founder of Samahaara Theatre Group. She began attending his weekend workshops while continuing her full-time job during weekdays. Bhavana was juggling both—working Monday to Friday and attending theatre classes every weekend. She enjoyed it so much that she even considered quitting her job to pursue theatre full-time. However, Ratna Shekar advised her to be cautious, explaining that theatre could be an unstable career path. He encouraged her to try part-time work if possible.
Fortunately, her company was incredibly supportive. Understanding that life goes beyond just corporate routine, they allowed her to reduce her hours. She took a 50% salary cut and began working just four hours a day—from 9 AM to 2 PM—so she could attend rehearsals in the afternoon. That’s when her first official theatre production, Maidanam, began. She performed it alongside Nasreen and her theatre group, and the experience was transformative. She continued her job part-time for over a year. COVID brought everything to a standstill, but she used the time to dive deeper into theatre workshops. With reduced expenses and some savings, she finally made the decision to quit her job and shift her focus fully to acting.
Luckily for Bhavana, things fell into place financially. Her next project was Paakuduraallu. Though she took up a few screen projects, her heart remained in theatre. So when Nasreen invited her to be part of Paakuduraallu, she jumped at the opportunity—
And that’s where we found Bhavana for Mayasabha. We know Paakudurallu is a Jnanpith award winning classic novel waiting to be told in visual formats. When our team was looking into adopting the novel onto screen, someone just sent us an Instagram poster with Bhavana posing as the leading lady “Manjari”. We were just blown by the aesthetic of the poster itself. Just when we were whining that theatre-which can also be a pipeline to groom great actors across the world across generations-is dead in Telugu, we saw this mind blowing show, brilliantly directed by Mrs. Nasreen and enacted by the entire crew. Bhavana especially was outstanding as the lead-Manjari. Just after the we enquired and called her for audition. As expected, she nailed. And there she is, Vaishnavi-MSR’s sweetheart and who became half his life.
A couple of moments from Bhavana’s brilliant performance in Mayasabha:
1. Episode 1 – the romantic glances and the alley scene: The romantic glances and tease during the “oggu katha” song were so spontaneous, heartwarming and magical. The way she performed the alley scene-which was a single for the entire conversation, you can observe many spontaneous moments, connectivity and the comfort of years of an ongoing love story can be felt so magically. She just lives for that moment in front of the camera.
2. Episode 3 – Overcoming the “brotherly” hurdles: Though she has less lines in the scene where MSR reconciles with her brother’s who want to reject her marriage with MSR, she lived the character like a tortured and beaten up sister fighting for her freedom. The way holds the scene in silence while MSR negotiates and the later scene where they both throw romantic glances at each other after the reconciliation demands more screen time for the character just because as an actor she is so brilliant and lively.
Bhavana admits that if theatre offered the kind of financial stability and exposure she needed, she would happily commit to it for life. At this stage, however, she’s aware that theatre or acting alone may not help her achieve all her life goals. She’s currently working in Bangalore while continuing to pursue acting and theatre simultaneously.
“This is where I am right now,” she shares—a balanced pursuit of passion and practicality.
Wishing Bhavana many more characters that continue to draw the best from the ocean of a talent within her.
Kudos to Bhavana’s passion for acting and her journey so far! – “Every person is a walking story.”
భావన తనని తాను ఎప్పుడూ ఒక నటిగా ఊహించుకోలేదు. నటన అనేది అసలు ఆమె ప్లాన్‌లోనే లేదు. ఆమె ఫస్ట్ మోటివేషన్ చాలా సింపుల్: financial independence. చిన్న వయసులోనే డబ్బు సంపాదించాలన్న ఆశయంతో Chartered Accountancy కోర్స్ ఎంచుకుంది—ఇది internship ద్వారా 18 ఏళ్లకే సంపాదించొచ్చే ప్రొఫెషన్లలో ఒకటి.
భావన చాలా హార్డ్ వర్క్ చేసి, CA exams clear చేసింది. తరువాత Ernst & Young అనే ప్రముఖ కంపెనీలో tax consultantగా జాయిన్ అయ్యింది. ఆ జాబ్ నచ్చింది—ఒక stability ఇచ్చింది. చేసే పని చాలా ప్రౌడ్ గా అనిపించేది. కానీ జీవితంలో ఇంకా ఏదో తెలియని అసంతృప్తి కూడా ఉండేది. ప్రతి రోజు ఉదయం లేచి “ఏదైనా కొత్త excitement ఉందా?” అనే ఉత్సాహం కనిపించేది కాదు.
2019 న్యూఈయర్కి ఆమె ఒక resolution తీసుకుంది: “ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం.” కొద్దిరోజులు salsa dance ట్రై చేసింది, కానీ అది తన కంఫర్ట్ హాబీ కాదని తొందరగా అర్థం చేసుకుంది. ఆ టైంలో, థియేటర్‌లో ఉన్న ఓ ఫ్రెండ్ “థియేటర్ ట్రై చేయవచ్చు” కదా అన్నాడు. అలా Samahaara Theatre Group ఫౌండర్ రత్న శేఖర్ గారితో పరిచయం అయ్యింది. వీకెండ్స్ ఆయన వర్క్‌షాప్స్‌లో పాల్గొంటూ, వీక్‌డేస్‌లో ఫుల్‌టైం జాబ్ చేస్తూ రెండు ప్రపంచాలను బ్యాలెన్స్ చేయడం మొదలుపెట్టింది.
థియేటర్ అంటే ఆమెకు అంతగా నచ్చింది, ఆ ఫీల్డ్‌లోనే ఫుల్ టైం వెళ్లాలా అని కూడా ఆలోచించింది. కానీ రత్నశేఖర్ గారు సలహా ఇచ్చారు—“జాగ్రత్తగా అడుగులు వేయాలి. థియేటర్‌లో స్టెబిలిటీ ఉండకపోవచ్చు. కావాలంటే పార్ట్ టైం వర్క్ చేస్తూ థియేటర్ లో కంటిన్యూ అవ్వొచ్చు.” అన్నారు. లక్కీగా దానికి ఆమె కంపెనీ కూడా సపోర్ట్ చేసింది. “జీవితం అంటే కేవలం కార్పొరేట్ రొటీన్ కాదు” అని అర్థం చేసుకుని, ఆమెకు హాఫ్ డే వర్కింగ్ అవర్స్ ఇచ్చారు. 50% salary తో, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకే వర్క్ చేసి, మిగతా టైం థియేటర్ రిహార్సల్స్‌కి డెడికేట్ చేసింది. అదే టైంలో ఆమె తొలి ప్రొఫెషనల్ థియేటర్ ప్రొడక్షన్ “మైదానం” మొదలైంది. థియేటర్ డైరెక్టర్ నస్రీన్ గ్రూప్‌తో కలిసి నటించింది. ఆ అనుభవం భావన జీవితాన్నే మార్చేసింది.
ఒక సంవత్సరం పాటు హాఫ్ టైం వర్క్ చేస్తూనే థియేటర్ చేస్తూ ముందుకు వెళ్లింది. కోవిడ్ టైంలో బ్రేక్ వచ్చినప్పుడు, ఆ టైమ్‌ను వర్క్‌షాప్స్‌కి డెడికేట్ చేసింది. ఖర్చులు తగ్గించుకుని, ఉన్న savingsతో చివరకు ఉద్యోగం వదిలేసి పూర్తిగా నటనపైనే ఫోకస్ పెట్టింది.
తర్వాత ఆమెకు “పాకుడురాళ్లు” అనే ప్రాజెక్ట్ వచ్చింది. కొన్ని సినిమా ప్రాజెక్ట్స్ చేసినా, భావన ఎక్సైట్మెంట్ మాత్రం థియేటర్‌లోనే ఉండేది. అందుకే నస్రీన్ మళ్లీ పిలిచినప్పుడు వెంటనే ఒప్పుకుంది. అదే పాకుడురాళ్లు”.
ఆ నాటకంలోనే మేము కూడా భావనను చూశాం—Mayasabha కోసం.
“పాకుడురాళ్లు” జ్ఞానపీఠ్ అవార్డ్ గెలిచిన ఓ గొప్ప నవల. దాన్ని స్క్రీన్‌కి తీసుకురావాలని మా టీం ఆలోచిస్తుంటే, ఎవరో పంపిన ఒక Instagram పోస్టర్‌లో భావన “మంజరీ” పాత్రలో కనిపించింది. ఆ పోస్టర్‌లో ఉన్న aesthetic appeal చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. “తెలుగు లో థియేటర్ చచ్చిపోయిందేమో” అని బాధపడుతున్న సమయంలో, ఆ ప్రదర్శన చూశాం—నస్రీన్ గారి అద్భుతమైన డైరెక్షన్‌తో, భావన తన నటనతో మంత్ర ముగ్ధుల్ని చేసింది. వెంటనే ఆమెతో మాట్లాడి, ఆడిషన్‌కి పిలిచాం. అనుకున్నట్టుగానే she nailed it. అలా ఆమె “వైష్ణవి”—MSR జీవితంలో ఆదా భాగమై పోయింది.
Mayasabha లో భావన నటనలో కొన్ని మేజికల్ మొమెంట్స్:
1. ఎపిసోడ్ 1 – రొమాంటిక్ గ్లాన్సెస్, అల్లే సీన్:
"ఒగ్గు కథ" పాట సమయంలో తాను MSR చేసే సైగలలకు ప్లేఫుల్ గా రెస్పాండ్ అయిన విధానం—all spontaneous, heartwarming. ఆ తరువాత జరిగే గల్లీ సీన్ ఒక సింగిల్ షాట్ కావడం, భావన ఇచ్చిన ప్రతి expression ఆ మూమెంట్ లో జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ల మధ్య ఎప్పట్నుంచో నడుస్తున్న ఒక ప్రేమకథలా కనిపిస్తుంది.
2. ఎపిసోడ్ 3 – అన్నగార్ల అడ్డంకులు దాటడం:
ఈ ఎపిసోడ్‌లో భావనకి డైలాగ్స్ తక్కువే ఉన్నా, ఆమె చూపిన expressions లో అన్నల ఆధిపత్యంలో నలుగుత, స్వేచ్ఛ కోసం పోరాడే ఒక సిస్టర్ లో ఉన్న ఉద్వేగం కనిపిస్తుంది. MSR మాట్లాడుతున్న సమయంలో ఆమె మౌనంగా నిలబడే తీరు, ఆ తర్వాత ఇద్దరూ చూసుకునే చూపులు—ఆమె పాత్రకు ఇంకొన్ని సీన్లు రావాల్సిన అవసరం ఉందని చెప్పినట్టు ఉంటాయి.
“థియేటర్ కూడా stable career అయి exposure ఇస్తే, జీవితం అంతా అదే చేస్తా.” అంటోంది భావన. కానీ ప్రస్తుతం practical గా జీవించాలంటే, జాబ్, నటన రెండూ కలిసి బ్యాలెన్స్ చేయాల్సి వస్తోంది. ఇప్పుడు బెంగుళూరులో పనిచేస్తూ, ఆమె నటన, థియేటర్ ప్రొఫెషన్ రెండిటినీ బాలన్స్ చేస్తూ లైఫ్ కొనసాగిస్తోంది.
భావన కి ఇంకా ఎన్నో గొప్ప అవకాశాలు రావాలని– తనలో ఉన్న ప్రతిభా సముద్రంలో నుంచి మరెన్నో ఆణి ముత్యాలను వెలికి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
నటన పట్ల భావనకున్న ప్యాషన్, ఇప్పటి వరకూ తాను చేసిన ప్రయాణానికి అభినందనలు! – “ప్రతి మనిషీ నడయాడే కథ!”