“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta
Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.
మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.
Charitha Varma never imagined a future in cinema. A studious, career-focused girl, her life revolved around academics and stability, with even her friends seeing her on a conventional path. That changed during her MBA in Delhi when a one-day photoshoot unexpectedly landed in a magazine. What began as an experiment sparked confidence and passion, drawing her toward auditions. Though the industry was daunting without connections or shortcuts, her determination and belief kept her going.
We picked her to play Rameshwari—KKN’s wife—in Mayasabha through auditions conducted by Dreamcasting Agency. She was expressive and fluent in Telugu, and we instantly felt she would make a good on-screen pair next to Aadhi, who is a little over six feet tall. On set, Charitha proved to be almost a single-take artist—always well-prepared with her lines, interactive, and enthusiastic about improvising on the spot.
Charitha’s memorable moments in Mayasabha:
1. Episode 9 – prank scene: In the scene where she complains about KKN’s college sweetheart, now a superstar visiting him in the groom’s room, we composed the entire interaction until their exit as a single shot with precise focus markings. Though this was her first significant character as an actor, she was brilliant in the way she hit her marks in every take. The scene turned engaging thanks to the ease and chemistry between Aadhi and her.
2. Episode 9 – hospital scene: Though it was a brief moment, she prepared extensively—using facial makeup and carrying a tired, distressed mood that reflected the conflict between her father and husband. The way she delivered the line, “మీ మావయ్య గారితో పంతం వద్దండి. ఇది మన కుటుంబం” was so authentic.
Wishing Charitha Varma many more important opportunities to grow into a sought-after actor.
------------
Yasho Bharat Reddy decided he wanted to become an actor as early as 7th grade, inspired by Megastar Chiranjeevi garu.
He entered the film industry in 2008. His first opportunity came in 2010 with the film Brahmalokam to Yamalokam via Bhoolokam. After that, he acted in several films such as Hrudaya Kaleyam, Kobbari Matta, Majili, Radha, and Bharat Ane Nenu. Though these films didn’t bring him major recognition, they were solid stepping stones in his journey as an actor. Later, he appeared in a negative role in the web series Vyuham. After a long period of inactivity, during a time of uncertainty when he was wondering, “What should I do now?”, he landed the main villain role in the film Jithender Reddy, marking a new turn in his life. This was followed by another opportunity in the film 23, which became another step forward in his acting career. Since 2008, his journey has been filled with hardships and humiliations—but none of that matters in front of his passion for cinema.
DOP Gnana Shekar, who shot the first two schedules of Mayasabha, referred Bharat to us, and that’s how he was cast as Deepak Reddy in Mayasabha. Bharat performed the character with a simmering rage throughout, giving the role a unique intensity. That approach gave the character a distinctive identity and made it one of the most talked-about roles in the series.
Memorable Moments of Bharat in Mayasabha:
1. Episode 2 – His Introduction Scene: The character is first introduced naturally while playing cricket, but then shifts dramatically as he grabs bats and stumps and heads out to threaten Krishnama Naidu not to contest in the elections. His line, “Ya oorra needi”, delivered upon seeing Krishnama Naidu, feels very authentic every time you watch it.
2. Episode 5 – Grabbing the MLC seat: When he snatches away the MLC seat meant for Krishnama Naidu, the way he taunts and parades around with smug mannerisms makes the scene incredibly memorable.
I truly hope Bharat, as a talented actor, climbs many more steps in his journey ahead.
చరిత వర్మ సినీ రంగంలో అడుగు పెట్టాలని ఎప్పుడూ ఆశించలేదు. చదువుపై ఫోకస్ ఉన్న అమ్మాయి. స్టేబుల్ కెరీర్, పదిలమైన జీవితం అన్నదే ఆమె లక్ష్యం. ఆమె స్నేహితులు కూడా తనని ఓ సాధారణ ఉద్యోగ జీవిగా ఊహించేవారు.
అయితే ఆమె ఢిల్లీలో ఎంబీఏ చదువుతున్న రోజుల్లో, ఒక రోజు ఫోటోషూట్‌కు వెళ్ళింది. ఆ ఫోటో షూట్ అనుకోకుండా ఒక మ్యాగజైన్‌లో పబ్లిష్ అయ్యింది. ఆమెలో ఒక కొత్త కాన్ఫిడెన్స్, ఆసక్తిని పుట్టించింది. అలా యాక్టర్ అవుదామన్న ఆశతో ఆడిషన్‌ల వైపు ప్రయాణం మొదలైంది. సినిమా ఇండస్ట్రీలో కానెక్షన్లు లేకుండా, షార్ట్‌కట్‌లు లేకుండా అడుగు పెట్టడం అంత ఈజీ కాదు. కానీ చరితలో ఉన్న దృఢమైన నమ్మకం, పట్టుదల ఆమెను ముందుకు నడిపించాయి.
అయితే ఆమె ఢిల్లీలో ఎంబీఏ చదువుతున్న రోజుల్లో, ఒక రోజు ఫోటోషూట్‌కు వెళ్ళింది. ఆ ఫోటో షూట్ అనుకోకుండా ఒక మ్యాగజైన్‌లో పబ్లిష్ అయ్యింది. ఆమెలో ఒక కొత్త కాన్ఫిడెన్స్, ఆసక్తిని పుట్టించింది. అలా యాక్టర్ అవుదామన్న ఆశతో ఆడిషన్‌ల వైపు ప్రయాణం మొదలైంది. సినిమా ఇండస్ట్రీలో కానెక్షన్లు లేకుండా, షార్ట్‌కట్‌లు లేకుండా అడుగు పెట్టడం అంత ఈజీ కాదు. కానీ చరితలో ఉన్న దృఢమైన నమ్మకం, పట్టుదల ఆమెను ముందుకు నడిపించాయి.
మయసభ కోసం ఆమెను డ్రీంకాస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ఆడిషన్‌ల ద్వారా ఎంపిక చేసాం. చరిత తెలుగులో స్వేచ్ఛగా మాట్లాడగలగడం, చక్కటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం మా దృష్టిని ఆకర్షించాయి.
ఆది పినిశెట్టి (KKN పాత్రలో) 6 అడుగుల ఎత్తు ఉండటంతో, స్క్రీన్‌పై వీరిద్దరి కాంబినేషన్ బాగుంటుందనిపించింది.
షూటింగ్ సమయంలో, చరిత చాలాసార్లు సింగిల్ టేక్ లోనే సన్నివేశాన్ని పూర్తి చేసేది. డైలాగులు బాగా ప్రాక్టీస్ చేసుకుని వచ్చేది. ఆన్ ది స్పాట్ ఇంప్రొవైజ్ చేయడంలోనూ మంచి ఉత్సాహం చూపేది.
చరిత వర్మ మయసభలో గుర్తుండిపోయే కొన్ని మొమెంట్స్:
1. ఎపిసోడ్ 9 – ప్రాంక్ సీన్: కాలేజీ టైమ్‌లో ప్రేమించిన అమ్మాయి (ఇప్పుడు ఒక సూపర్‌స్టార్) పెళ్లి రోజు KKN ని కలవడానికి groom roomకి వచ్చినందుకు, చరిత అసూయగా గొడవ పెట్టుకునే సన్నివేశం. ఇది మొత్తం సింగల్ షాట్ లాగా డిజైన్ చేశాం. ఫోకస్ మార్కింగ్‌లు, నటుల మూమెంట్—all perfectly planned. చరిత తన మార్క్‌ను ప్రతి టేక్‌లో ఖచ్చితంగా స్ట్రైక్ చేస్తూ, మంచి నైపుణ్యం చూపింది. ఆది-చరిత మధ్య ఉన్న చక్కటి కెమిస్ట్రీవలన సీన్ engaging అయింది.
2. ఎపిసోడ్ 9 – హాస్పిటల్ సీన్: చిన్న సన్నివేశం అయినా, ఆమె చాలా డెడికేషన్‌తో ప్రిపేర్ అయ్యింది. అప్పుడే డెలివరీ అయిన తల్లిలా తాను చేసుకున్న మేక్ అప్, మెంటల్ గా అలసి పోయి, తండ్రికి భర్త మధ్య జరుగుతున్నా రాజకీయ యుద్ధం గురించి బాధ పడుతున్న భార్యగా జస్ట్ సైలెంట్ ఎక్స్ప్రెషన్స్ లోనీ ఫీల్ వచ్చేలా నటించింది. "మీ మావయ్య గారితో పంతం వద్దండి. ఇది మన కుటుంబం" అనే డైలాగ్ చాలా నిజాయితీగా, భావోద్వేగంతో చెప్పింది.
చరిత వర్మకి ఇంకా మంచి పాత్రలు రావాలని, మంచి నటిగా ఎదగాలని ఆశిస్తున్నాం.
-------------------------
యశో భరత్ రెడ్డికి ఏడవ తరగతిలోనే చిరంజీవిగారి ప్రభావం వల్ల యాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు.
2008లో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 2010లో బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం అనే సినిమాలో మొదటి అవకాశం లభించింది. ఆ తరువాత హృదయకాలేయం, కొబ్బరిమట్ట, మజిలీ, రాధా, భరత్ అనే నేను వంటి పలు చిత్రాల్లో నటించాడు. ఈ సినిమాలు పెద్దగా గుర్తింపు ఇవ్వకపోయినా, నటుడిగా తన ప్రస్థానానికి బలమైన అడుగులు అయ్యాయి. తర్వాత వ్యూహం అనే వెబ్ సిరీస్‌లో నెగటివ్ పాత్రలో కనిపించాడు. చాలా కాలం ఖాళీగా ఉండి, "ఇప్పుడు ఏం చేయాలి?" అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో, జితేందర్ రెడ్డి అనే సినిమాలో మెయిన్ విలన్ పాత్ర రావడం అతని జీవితంలో ఓ కొత్త మలుపు. తర్వాత 23 అనే సినిమాలో మరో అవకాశం. నటుడిగా మరో మెట్టు. 2008 నుంచి సాగిన తన ప్రయాణంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురయ్యాయి. కానీ సినిమా మీద తనకున్న ప్యాషన్ ముందు అవేవీ గుర్తు రావు.
మయసభ మొదటి రెండు షెడ్యూల్స్ షూట్ చేసిన డి ఓ పి జ్ఞాన శేఖర్ రెఫర్ చెయ్యడంతో భరత్ ని మయసభలో దీపక్ రెడ్డి పాత్రకి పిక్ చేసుకున్నాం. భారత్ ఆ కారెక్టర్ మొత్తం ఎప్పుడూ కోపంతో నిండిన వణుకుతో కనిపించేటట్టు పెర్ఫార్మ్ చేశాడు. అది ఆ పాత్రకి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. సిరీస్ చూసిన ఎక్కువగా మాటాడుకున్న పాత్రలలో ఒకటి అయ్యింది.
మయసభలో భరత్ గుర్తుండిపోయే మొమెంట్స్ :
1. ఎపిసోడ్ 2 లో తన ఇంట్రో సీన్: natural గా క్రికెట్ ఆడుతూ పరిచయం అయ్యే కేరెక్టర్ తరువాత బ్యాట్లు స్టంప్ లు పట్టుకుని కృష్ణమ నాయుడ్ని ఎలక్షన్ లో పోటీ చేయకుండా బెదిరించడానికి వెళ్లిన సీన్ లో తకు కృష్ణమ నాయుడ్ని చూసి “యా ఊర్రా నీది” అనే మూమెంట్ చూసినప్పుడల్లా చాలా అథెంటిక్ గా అనిపిస్తుంది.
2. ఎపిసోడ్ 5 MLC seat తెచ్చుకోవడం: కృష్ణమ నాయుడికి రావాల్సిన ఎంఎల్సీ సీట్ తాను కాజేసినప్పుడు తనని రెచ్చగొడుతూ ఊరేగుతూ చెసే మ్యానరిజేమ్స్ చాలా మెమరబుల్ గా ఉంటాయి.
భరత్ ఒక మంచి నటుడిగా, తన ప్రయాణంలో ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలని ఆశిస్తున్నాం.