“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta
Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.
మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.
Suresh Ragutu was born in Kharagpur, West Bengal, to Telugu parents. Growing up, his dream was to become a cricketer. But everything changed when he moved to Hyderabad in 2005 for higher studies. That was when cinema began to capture his attention, largely because of his brother, Ram Prasad Ragutu, a passionate film lover. Together, they spent countless hours watching movies, discussing cinema, and even making short films—often borrowing cameras from friends. During this process, Ram Prasad recognized Suresh’s eye for photography and encouraged him to pursue filmmaking seriously, guiding and supporting him every step of the way.
This path eventually led Suresh to work with renowned cinematographer Senthil Kumar on landmark films such as Magadheera and Eega. These experiences shaped his craft, and in 2014, he made his debut as an independent cinematographer with Chandamama Kathalu, which went on to win the National Award for Best Regional Film in 2015.
Although he expected his journey to become easier after such recognition, reality proved otherwise. For nearly a decade, Suresh poured his heart into every film, striving to justify his work. While his cinematography often drew praise, he struggled to find true fulfillment—especially when the films themselves didn’t succeed at the box office. More often than not, he felt more disappointed than the directors themselves.
After nine years of this uphill journey, frustration set in. Doubts grew, and he began to lose patience. At his lowest point, he prayed sincerely for just one inspiring script and one positive team. According to him, the answer to that prayer was Mayasabha.
The cinematographer initially attached to Mayasabha was the renowned Gnanasekhar V.S. (known for Vedam, Kanche, Manikarnika, Gautamiputra Satakarni and more), who is also a close friend of mine. This project inspired him a lot. But since he had already spent a lot of time on Hari Hara Veeramallu, he was also eager to get back to cinema. By the time he shot 30% of Mayasabha, another film offer came his way. Managing prep work and shoots for both the projects began to take a toll on him and the project. For me, the health and happiness of the crew always comes first. When a crucial schedule clashed with his other film, we had to look for a DoP to step in for a week.
That’s when Suresh came on board. My partner Kiran’s working experience with Suresh on PSV Garudavega helped as a good reference for Suresh. Suresh’s time commitment, detailed preparation before each shoot, sharp editing sense while shooting, speed, and ability to maintain the quality took us by surprise. On top of it all, the positive energy he brought to the sets was infectious. Once we realized that the project was in safe hands with Suresh, we encouraged Gnana to continue on the other film.
The moment Suresh received the script of Mayasabha, he read it in a single sitting—eight hours without pause. He was pulled completely into the world and knew this project was special. Because of his commitment and craft, we completed the entire show in 89 days (initially scheduled for 105) and within budget—without compromising on the quality that audiences are praising today.
The countless hours he spent and the numerous options he explored on the grading table were crucial. Annapurna Studios was immensely cooperative, and a special mention goes to grader Vasanth, who, along with Suresh, presented three completely different grading options for the entire footage. Through discussions and debates, we—directors and producers—also learned a great deal before finalizing the look.
Working with Suresh was not just an evolution for him, but for all of us. As he says, “With Mayasabha, I not only found success but also rediscovered the joy of filmmaking. For the first time in years, I feel truly fulfilled—not just as a technician, but as an artist and storyteller.”
Suresh is now like a brother to me. We wish him many more opportunities and much greater success for his extraordinary commitment, passion, and endless zeal to learn and experiment as a cinematographer.
సురేష్ రగుతు పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో తెలుగు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడు క్రికెటర్ అవ్వాలనేదే తన కల. కానీ 2005లో కాలేజ్ స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ కల మారి పోయింది. సినిమాలపై ఆకర్షణ మొదలైంది. తన అన్న రామ్ ప్రసాద్ రగుతు, తను కలిసి దీక్షగా సినిమాలు చూడడం చర్చించడం మొదలు పెట్టారు.
సురేష్ మరియు రామ్ ప్రసాద్ కలిసి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు—చాలాసార్లు మిత్రుల దగ్గర నుండి కెమెరాలు అద్దెకు తీసుకునేవారు. ఈ ప్రయాణంలో, సురేష్ కు ఫోటోగ్రఫీ మీద ఉన్న ఆసక్తిని గమనించిన రామ్ ప్రసాద్, తనని సినిమాటోగ్రఫీ దిశగా ప్రోత్సహించారు, ప్రతి దశలో సహాయం చేశారు.
ఈ మార్గంలో సురేష్ కి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సెంతిల్ కుమార్ గారితో పని చేసే అవకాశం దొరికింది. “మగధీర”, “ఈగ” వంటి చిత్రాల్లో సురేష్ అసిస్టెంట్‌గా పని చేశాడు. ఈ అనుభవాలే తనని సినిమాటోగ్రాఫర్‌గా తీర్చిదిద్దాయి. 2014లో "చందమామ కథలు"తో ఇండిపెండెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు. ఆ చిత్రం 2015లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది.
అలాంటి గుర్తింపు వచ్చిన తర్వాత ప్రయాణం సులువవుతుందని అనుకున్నాడు. కానీ వాస్తవం వేరు. దాదాపు దశాబ్దం పాటు ప్రతి సినిమా పట్ల ప్రేమతో పనిచేశారు. కెమెరావర్క్‌కు ప్రశంసలు వచ్చేవి, కానీ సినిమాలు కమర్షియల్‌గా ఫలించనప్పుడు అసలైన సంతృప్తి దక్కేది కాదు. చాలా సార్లు డైరెక్టర్లకంటే తనే ఎక్కువగా నిరుత్సాహపడేవాడు.
ఒక ఇన్స్పైరింగ్ కథ, మంచి టీమ్ కోసం ప్రతి రోజు ప్రార్ధించేవాడు. సురేష్ మాటల్లో “తొమ్మిదేళ్ల తర్వాత, మయసభతో ఆ కల నెరవేరింది. నా రాత మార్చింది”.
మొదట్లో మయసభ సినిమాటోగ్రాఫర్ పని మొదలు పెట్టింది జ్ఞానశేఖర్ వి.ఎస్. (వేదం, కంచె, మణికర్ణిక, శాతకర్ణి లాంటి గొప్ప చిత్రాలు చిత్రీకరించారు.). జ్ఞాన ఎప్పట్నుంచో నా స్నేహితుడు కూడా. జ్ఞానా కి కూడా ఈ కథ చాలా ఇష్టం. కానీ అప్పటికే హరి హర వీరమల్లులో ఎక్కువ సమయం గడిపారు. మయసభలో 30% షూట్ చేశాక మరో సినిమా అవకాశం వచ్చింది. రెండు పనులూ ఒకేసారి మేనేజ్ చేయడం కష్టం అయ్యింది. నేనెప్పుడూ నా టీమ్ ఆరోగ్యంగా, సంతోషంగా పని చెయ్యాలని కోరుకుంటాను. జ్ఞానా కి రెండు ప్రాజెక్ట్ ల మధ్య వచ్చిన షెడ్యూల్ క్లాష్ వల్ల ఒక వారం షూట్ చెయ్యడానికి మరో సినిమాటోగ్రాఫర్ అవసరమయ్యాడు.
అప్పుడే సురేష్ రంగప్రవేశం చేశాడు. తను “PSV గరుడవేగ” లో నా పార్టనర్ కిరణ్ (ఆ సినిమాకి first AD) తో పని చేసిన అనుభవం నాకొక ఒక బలమైన రిఫరెన్స్ అయ్యింది. షెడ్యూల్స్‌కు ముందు డీటెయిల్డ్ ప్రిపరేషన్, షూట్ లో ఎడిటింగ్ దృష్టితో పనితీరు, వేగం, ఇవన్నీ మాకు ఆశ్చర్యం కలిగించాయి. సురేష్ తో పని చేసిన తర్వాత— “ప్రాజెక్ట్ సేఫ్ హ్యాండ్స్‌లో ఉందని మాకూ ధైర్యం వచ్చింది. అప్పుడు జ్ఞానా ను తాను చేస్తున్న సినిమా మీద కాన్సంట్రేట్ చేయమని ప్రోత్సహించాం.
స్క్రిప్ట్ అందిన రోజే సురేష్ ఒకే సీట్‌లో 8 గంటలపాటు కూర్చుని సింగల్ స్ట్రెచ్ లో చదివేశాడు. పూర్తిగా ఆ ప్రపంచంలో మునిగిపోయాడు. ఆ క్షణమే తాను ఫిక్స్ అయిపోయాడు – ఇదొక స్పెషల్ ప్రాజెక్ట్ అవుతుందని. సురేష్ నిబద్ధత వల్ల, మేం 105 రోజులకు ప్లాన్ చేసిన ప్రాజెక్ట్‌ను 89 రోజుల్లో పూర్తి చెయ్యగలిగాం– అదీ బడ్జెట్‌లో, క్వాలిటీతో.
కలర్ గ్రేడింగ్ విషయంలో సురేష్ చాలా ఎఫర్ట్ పెట్టాడు. అన్నపూర్ణ స్టూడియోస్ కూడా బాగా సహకరించింది. సురేష్ గ్రేడర్ వసంత్‌తో కలిసి మూడు వేరువేరు గ్రేడ్ ఆప్షన్స్ చూపించాడు. దర్శకులు, నిర్మాతలు కలిసి తేల్చే వరకు చర్చలు జరిపారు. మాకూ చాలా నేర్చుకునే అవకాశం దక్కింది.
సురేష్ తో పని చేయడం తనకే కాదు – మాకు కూడా ఒక ఎవల్యూషన్, లెర్నింగ్ ఎక్స్ప్రీరియన్స్. తన మాటల్లో:“మయసభతో నేను కేవలం సక్సెస్ నే కాదు, సినిమాని ప్రేమించే ఆనందాన్ని తిరిగి పొందాను. ఇప్పుడు ఒక టెక్నీషియన్‌గానే కాదు, ఒక ఆర్టిస్ట్‌గా, కథ చెప్పేవాడిగా సంతృప్తినీ, కాన్ఫిడెంట్ నీ పొందాను.”
ఈ రోజు సురేష్ నా తమ్ముడి లాంటివాడు. సినిమాటోగ్రఫీ మీద తనకున్న ప్యాషన్, కమిట్‌మెంట్, కొత్తగా నేర్చుకోవాలన్న తపన, తనకి మరెన్నో గొప్ప అవకాశాలు తీసుకురావాలని, తను గొప్ప సినిమాటోగ్రాఫర్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.