“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta
Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.
మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.
Kiran J. Kumar was born in Kurnool district into a family with no connection to cinema. Aware that openly declaring his intent to pursue films wouldn’t be accepted at home, he moved to Hyderabad after completing his degree under the pretext of taking up a job. For the next three years, he secretly searched for opportunities as an assistant director, while surviving through various odd jobs.
Eventually, he landed an assistant director role and felt like he was finally stepping into the world of his dreams. However, when a cousin revealed his work in films, his father stopped speaking to him for nearly three years. Years later, his father eventually accepted it, saying, "He won’t change now."
Kiran's film journey wasn’t smooth. He had to endure producers who cheated him financially, directors who looked down on assistant directors, and countless emotional setbacks— like one of his project that halted unexpectedly despite everything being ready, and humiliations that broke his spirit. Yet, he stayed strong and continued forward.
Kiran first reached out to me after watching Prasthanam, through a common friend. I don’t remember our first conversation, but by the time I was wrapping up Autonagar Surya, he had started working on his own scripts, looking for directing opportunities. He eventually decided to join a remake I was working on, as part of the direction team. Observing my disinterest in that project, he boldly told me to my face, “Sir, what karma is this for you?” and walked away.
I didn’t want honest assistants like Kiran to suffer the consequences of my poor choice, so I advised four other assistants to leave that project as well. That moment gave me a positive impression on Kiran. I realized that with the right support system, he would become a very good director one day. People around me were often either blindly stubborn or overly submissive. But Kiran had both the curiosity to learn/evolve and the self-respect to express his thoughts without fear—a rare and essential quality in any artist or human being.
Later, while I was helming the Baahubali Netflix series, I noticed Kiran working as the First AD in my partner’s direction department. During script discussions, I was impressed by his thoughtful, grounded inputs. I had long been searching for someone who matched my writing sensibilities, and up until then, I had always written my projects—short or long form—entirely by myself.
That’s when I made a pact with Kiran: “From now on, for every story I develop, you will function as a credited writer-partner. And if needed, I’ll also participate in your stories.”
Our partnership began with the writing of Republic. Seeing his name as a credited writer on that film, and hearing people speak so highly about the film, his father finally felt pride, feeling, “My son is on the right path.” It was a memorable moment in Kiran’s life.
For Mayasabha, I asked Kiran to also join as a director-partner. At that time, he was already developing a script for his own directorial debut. Even though he knew working with me might overshadow his efforts or credit, he still committed three years to the project, contributing immensely. A series like Mayasabha, with the scale of three full-length films, being completed in 89 days wouldn’t have been possible without Kiran’s partnership.
Mayasabha’s success is only the first crucial step toward Kiran’s long-cherished dream of becoming a director. He will soon be making his directorial debut. He often jokes, “This industry owes me a lot, and I won’t stop until I claim it back!”
Kiran’s journey—marked by sacrifices and hardships—is now inching closer to the goal he’s been chasing. I wholeheartedly wish that he continues onward with a trend: “six blockbusters and three awards:
కిరణ్ జె. కుమార్, కర్నూర్ జిల్లాలో సినిమా వాసనే లేని కుటుంబం నేపథ్యంలో పుట్టాడు. సినిమానే కెరీర్‌గా ఎంచుకుంటానని ముందే చెప్పితే ఇంట్లో ఒప్పుకోరని గ్రహించాడు. అందుకే డిగ్రీ పూర్తయ్యాక “జాబ్ చేస్తాను” అన్న నెపంతో హైదరాబాద్ చేరాడు. కానీ ఇంట్లో వాళ్లకు తెలియకుండా సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశాలు వెతుకుతూ, బతుకుదెరువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మూడు సంవత్సరాలు గడిపాడు. చివరికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం దక్కగానే, తన కలల తీరం సినిమా దిశగా అడుగులు వేస్తున్నానని అనుకున్నాడు. అయితే ఆ సమయంలో ఒక కజిన్ ద్వారా “సినిమాల్లో పని చేస్తున్నాడు” అని తెలిసి, కిరణ్ తండ్రి దాదాపు మూడు సంవత్సరాలు అతనితో మాటలే మానేశారు. ఆ తర్వాత కొన్నేళ్ళకి “ఇక మారదులే” అని సరిపెట్టుకున్నారు.
కిరణ్ సినీ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. డబ్బులు ఎగ్గొట్టే ప్రొడ్యూసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్‌ని ఆత్మాభిమానం లేని వాడిగా చూసే డైరెక్టర్లను భరిస్తూ గమ్యం వైపు అడుగులు వేశాడు. ఆర్థికంగా ఎదుర్కునే సమస్యలు, డైరెక్టర్ అవడానికి అన్నీ సమకూరి కూడా అనూహ్యమైన కారణాల వల్ల ఆగిపోయిన సందర్భాలు, మనసుని ముక్కలు చేసే ఎన్నో అవమానాలు...ఇవన్నీ తట్టుకుంటూ తన మనో స్థైర్యాన్ని పెంచుకుంటూనే వచ్చాడు.
కిరణ్ మొట్ట మొదటి సారి ప్రస్థానం సినిమా చూసి ఓక కామన్ ఫ్రెండ్ ద్వారా మెంబర్ తీసుకుని కాల్ చేశాడు. అప్పటి తన మాటలేవీ నాకు గుర్తు లేదు. ఆటోనగర్ సూర్య పూర్తి చేసే సమయానికి కిరణ్ తన సొంత కథలతో డైరెక్టర్ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ ఒక్క సినిమా నాతో ట్రావెల్ చెయ్యాలని నిర్ణయించుకుని, నేను మధ్యలో వెదిలి వేసిన ఒక రీమేక్ చిత్రంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరాడు. అక్కడ నేను అసంతృప్తిగా పని చెయ్యడం చూసి “మీకేం ఖర్మ సర్” అని మొహం మీద చెప్పి వదిలి వెళ్లి పోయాడు. నా నిర్ణయం వల్ల ఎదురయ్యే కష్ట నష్టాలు కిరణ్ లాంటి హానెస్ట్ అసిస్టెంట్స్ అనుభవించకూడదని నా చుట్టూ ఉన్నమరో నలుగురు అసిస్టెంట్స్ ని కూడా వెళ్లి పొమ్మని చెప్పాను. ఆ నిర్ణయానికి కూడా కిరణ్ వ్యక్తపరిచిన హానెస్ట్ ఒపీనియన్. అప్పుడే కిరణ్ మీద నాకొక మంచి అభిప్రాయం ఏర్పడించి. సరైన సపోర్ట్ సిస్టం ఉంటే ఏ రోజైనా ఒక మంచి డైరెక్టర్ అవుతాడని నమ్మకం కుదిరింది. నా చుట్టూ అలాంటి వారే కావాలనిపించింది. ఉంటే ఒకటి మూర్ఖంగా మొండిగా ఉంటారు, లేదంటే వంగి వంగి గులాములు కొడుతుంటారు. నేర్చుకోవాలనే తపనతోపాటు, నేర్చుకున్న విషయాన్ని హేతుబద్ధంగా భయం లేకుండా ఎక్స్ప్రెస్ చేసే ఆత్మాభిమానం కిరణ్ లో కనిపించాయి. ఏ మనిషికైనా కళాకారుడికైనా ఉండాల్సిన మొట్ట మొదటి లక్షణం ఇది.
తరువాత యాదృశ్చికంగా కిరణ్ ని బాహుబలి నెట్ఫ్లిక్స్ సిరీస్ చేస్తున్నప్పుడు నా పార్టనర్ డిపార్మెంట్ లో ఫస్ట్ ఏ.డి గా చూసాను. పార్టనర్ కీ నాకు మధ్య జరిగే స్క్రిప్ట్ డిస్కషన్ లో కిరణ్ ఇన్ పుట్స్ చాలా సెన్సిబుల్ గా అనిపించాయి. అప్పటి వరుకు నా sensibilities కి మ్యాచ్ అయ్యే రైట్ పార్టనర్స్ కోసం వెతికి వెతికి అలిసి పోయాను. ఎంత చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా (సిరీస్ అంటే మూడు నాలుగు సినిమాలంత రైటింగ్ చెయ్యాలి) రైటింగ్ మొత్తం నేనే చేసుకునేవాడిని.
అప్పుడే కిరణ్ తో ఒక పాక్ట్ మాట్లాడుకున్నాను: “ఇక మీదట నేను డెవలప్ చేసే ప్రతి కథలోనూ నువ్వు క్రెడిటెడ్ రైటర్ పార్టనర్ గా ఉండు. అవసరమైతే నువ్వు డెవలప్ చేసే కథల్లో నేనూ పార్టిసిపేట్ చేస్తాను”. అలా మా ఇద్దరి partnership రిపబ్లిక్ writing తో మొదలైంది. రిపబ్లిక్ సినిమా చూసి, అందులో రచయతగా కిరణ్ క్రెడిట్ చూసి, ఆ సినిమా గురించి జనాలు గొప్పగా మాట్లాడటం విని, తన నాన్న మొదటి సారి “నా కొడుకు సరైన మార్గంలో ఉన్నాడు” అనే భరోసా వ్యక్తపరచడం కిరణ్ జీవితంలో ఒక మెమరబుల్ మొమెంట్.
మయసభ సిరీస్ కి కిరణ్ ని డైరెక్టర్ పార్టనర్ గా కూడా జాయిన్ అవమని రిక్వెస్ట్ చేశాను. అప్పటికే తాను సినిమా ఫార్మాట్ లో డైరెక్టర్ గా లాంచ్ అవడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడు. నాతో పని చేస్తే తన effort, credit, over shadow అయ్యే ప్రమాదముందని తెలిసి కూడా ఒప్పుకుని, మూడేళ్లు తన టైం ఇన్వెస్ట్ చేసి చాలా వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ అందించాడు. మూడు సినిమాల నిడివిగల మయసభ 89 రోజుల్లో పూర్తి చెయ్యడమంటే కిరణ్ పార్ట్నర్షిప్ లేకుండా అసాధ్యం.
మయసభ విజయం కిరణ్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న long director career dream లో కీలమైన మొదటి మెట్టు మాత్రమే. అతి త్వరలోనే సినిమా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. పరిశ్రమ తనకి తిరిగివ్వాల్సిన అప్పు చాలా ఉందని, దాన్ని తిరిగి తీసునే వరకు తన ప్రయత్నాలు ఆగవని సరదాగా అంటుంటాడు
కిరణ్ ఎంతో కాలంగా ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కుంటూ చేరువవుతున్న లక్ష్యం, “ఆరు బ్లాక్ బస్టర్ లు మూడు అవార్డ్లు” గా కొన సాగాలని మనసారా ఆశిస్తున్నాను.