pizza

“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta

Article #21: Vijay Krishna (Producer)
ఆర్టికల్ #21: విజయ్ కృష్ణ (ప్రొడ్యూసర్)

You are at idlebrain.com > news today >

13 September 2025
Hyderabad

“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta


Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.

మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.

Don’t encourage piracy. Please watch #Mayasabha only on SonyLiv

Vijay Krishna was born into a simple, honest, middle-class government employee’s family. He was a bright student and earned a Bachelor’s degree in Architecture from Andhra University, Vizag. After working at L&T in Chennai for 18 months, he resigned to pursue his true passion—cinema, which had been chasing him since childhood. In 2008, he moved to Hyderabad looking for any problem-solving opportunities in the film industry.

In 2009, while we were looking for a line producer, a common friend introduced us to Vijay. Prasthanam was a highly ambitious film compared to the monetary and human resources we had at the time. The producers were more like investors and not actively involved in day-to-day production. We went through many crises and uphill battles just to complete the film and secure a theatrical release slot. Until then, I only had Vennela in my kitty, but Prasthanam upgraded my visiting card as a more serious filmmaker. Looking back now, especially after reuniting with Vijay as Producer for Mayasabha, I still get tears in my eyes when I think of how restlessly and tirelessly Vijay worked to solve every production crisis during Prasthanam, ensuring the film’s release. I am forever indebted to his commitment to cinema.

Though our paths diverged after Prasthanam until Mayasabha, we always remained the thickest of friends—sharing, ideating, helping, and participating in each other’s ambitions. He has been more like family to me since those days. Vijay is not a millionaire, nor is he someone who chases wealthy friends, but he constantly strives to make impactful cinema within the limited resources he can gather. I believe he has the soul to handle an Avatar-scale project with the same ease—absorbing everyone else’s stress instead of feeling it himself. The beauty of Vijay’s skill set is that he can handle any job in cinema.

After working as a Line Producer in Prasthanam, Vijay successfully debuted as a Director with Asura (2015), starring Nara Rohith, and Thipparaa Meesam (2019), with Sri Vishnu. He also directed the blockbuster series ParamparaSeasons 1 & 2 on Hotstar, produced by ARKA Mediaworks (Shobu and Prasad garu). That’s his director’s facet.

As a Producer, Vijay backed the highly acclaimed Appatlo Okadundevadu (2016), which launched Bheemla Nayakdirector Sagar K Chandra and established Sri Vishnu as a bankable actor. He went on to produce Kathalo Rajakumari(2017) and Needhi Naadhi Oke Katha (2018), which launched Virata Parvam director Venu Udugula. With the highly successful Mayasabha in his portfolio, Vijay is currently producing two more new-age entertainers and is always on the lookout for exciting ideas from the ground up.

the impact of spending on screen. That’s the quintessential quality of a true producer. In my short career, I have only seen Shobu and Prasad garu function in this way—parenting a project from idea to final shape.

Here are just a few examples (out of hundreds) that made me realize Vijay’s value as a passionate, intelligent, and creative producer:

1. The Aerodrome Segments:
For scenes where Ira exits an airplane and is greeted by state leaders, traditional methods quoted us exorbitant prices. With Vijay’s persistence, he found an empty parking lot far from regular shoot spots, got the sequences storyboarded, worked with art and CG teams to create a small section of the aircraft, and rescheduled the shoot multiple times. Ultimately, the budget was reduced by 80%. On that very day, Sony’s senior executives visited the sets. They were thrilled with the rushes and even remarked that investing another 7–8 crores wouldn’t have given us such output. The entire credit for that compliment goes to Vijay.

2. Being Calculative About Spending:
Though we initially negotiated a certain number of crowd call sheets, once we began shooting, the scale demanded more. The total nearly doubled. While we tried to cut down, Vijay insisted on more crowds to maintain the energy of the show. At the same time, he showed restraint by requesting the removal of the Clash of Titans sequence (the RCR and Iravati face-off) to save costs. It was one of the costliest planned shoots, at 35 lakhs per day, including cast, location, and crowd costs. By eliminating it, we saved massively while still delivering the required impact. Knowing when and where to challenge the creators is a rare producer skill.

3. Creative Contributor:
As a director himself, Vijay often provided sharp insights. For example, in Episode 1, we initially had all tracks introduced as per screenplay. But Sony’s team and initial viewers wanted to see the leads again towards the end. While I managed to adjust some tracks, I couldn’t solve the closure. Vijay suggested breaking the opening phone conversation and using part of it at the end. Initially, I disagreed, but after seeing his cut, I realized it worked beautifully. Today, I can’t imagine a different closure to that episode.

4. Fighting for Every Shot:
Even after QC approved some CG shots, Vijay pushed until the last moment to further enhance their quality, knowing they represented the show’s scale and emotion. He even remastered some episodes at additional cost, ensuring the highest standards.

Vijay is a calm sage who carries cinema in his soul. No matter how turbulent the situation, he never loses his composure. He always lets his mind work peacefully on solutions, a quality I deeply admire and wish to emulate.

The industry needs more producers like Vijay—discovering new talent, nurturing new ideas, and delivering impactful films. For me personally, I need the Vijays of the world, and so does cinema. He brings so much positive energy that by the end of a project, the journey feels like a beautiful dream you want to relive again. I can’t wait for my next collaboration with him, whenever that is.

Wishing Vijay Krishna to capitalize on this milestone and become one of the great forces of Indian cinema. He truly deserves many more opportunities and successes.

Love you Vijay—thank you for Mayasabha and thank you for being my friend, family, and support all along, and forever.

Don’t encourage piracy. Please watch #Mayasabha only on SonyLiv

“ప్రతి మనిషీ నడయాడే కథ!” – ఆర్టికల్ #21: విజయ్ కృష్ణ (ప్రొడ్యూసర్)

విజయ్ కృష్ణ ఒక సాధారణ, నిజాయితీగల మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో పుట్టాడు. చదువులో చురుగ్గా ఉంటూ, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం నుండి ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత చెన్నైలోని ఎల్ అండ్ టీకంపెనీలో 18 నెలల పాటు పనిచేశాడు. చిన్ననాటి నుంచే వెంటాడుతున్న సినిమా పట్ల ఉన్న ఆసక్తి వల్ల, ఉద్యోగాన్ని వదిలేసి 2008లో సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌ వచ్చాడు.

2009లో, మేము లైన్ ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్న సమయంలో, ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా విజయ్ పరిచయమయ్యారు. ప్రస్థానం సినిమా ఆ టైం లో మా దగ్గరున్న బడ్జెట్, మానవ వనరుల పరంగా చాలా భారీ ప్రాజెక్ట్‌. నిర్మాతలు పెట్టుబడిదారుల్లా ఉండేవారు, రోజువారీ పనుల్లో తలదూర్చరు. సినిమా పూర్తయ్యేందుకు, థియేటర్ రిలీజ్ షెడ్యూల్ దక్కించుకోవడానికి విజయ్ చేసిన కృషి ఇంతా అంతా కాదు. అప్పటికి నా ఖాతాలో వెన్నెల అనే హిట్ ఉన్నా, ప్రస్థానం నాకొక ఒక సీరియస్ ఫిల్మ్‌మెకర్‌గా గుర్తింపునిచ్చింది. ఆ గుర్తింపుకి జీతం లేకుండా విజయ కృషి కూడా ఒక ఆధారం.

మయసభ కోసం విజయ్‌తో మళ్లీ కలవడం, పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది. ప్రస్థానంలో ప్రతి చిన్న సమస్యను పరిష్కరించడానికి విజయ్ చేసిన అహర్నిశల కృషిని గుర్తు చేసుకుంటే నాకు కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అతనికి సినిమాపై ఉన్న ప్రేమకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రస్థానం తర్వాత మా దారులు వేరైనా, స్నేహం మాత్రం అలాగే నిలిచింది. విజయ్ నాకు కుటుంబ సభ్యుడి లాంటివాడు . తన ధనవంతుడు కాదు, ధనవంతుల చుట్టూ తిరిగేవాడు కూడా కాదు. కానీ తనకున్న పరితమైన రిసోర్స్ తో గొప్ప సినిమాలు చేయాలని ప్రయత్నిస్తాడు. అతనిలో అవతార్ స్థాయి సినిమాని కూడా ఏ మాత్రం స్ట్రెస్ లేకుండా హ్యాండిల్ చేయగల సత్తా, టాలెంట్, స్కిల్ మరియు ఆత్మ స్థైర్యం ఉన్నాయి. సినిమాకు సంబంధించిన ఏ పనైనా చేయగల సామర్థ్యం తనది.

విజయ్, అసురా (2015), తిప్పరా మీసం (2019) సినిమాల ద్వారా దర్శకుడిగా కూడా విజయవంతంగా అరంగేట్రం చేశాడు. అలాగే హాట్‌స్టార్లో ప్రసారమైన పరంపర సీజన్ 1 & 2కి కూడా దర్శకత్వం వహించాడు (ARKA మీడియావర్క్స్ నిర్మాణంలో).

నిర్మాతగా, విజయ్ అప్పట్లో ఒకడుండేవాడు (2016) సినిమాను నిర్మించాడు. ఇది భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్రను లాంచ్ చేసిన సినిమా. మంచి నటుడిగా శ్రీ విష్ణుకి గుర్తింపు తెచ్చిన సినిమా. తరువాత కథలో రాజకుమారి (2017), నీదీ నాదీ ఒకే కథ (2018) సినిమాలను నిర్మించాడు. విరాట పర్వం దర్శకుడు వేణు ఉదుగులను పరిచయం చేశాడు. మయసభ విజయం తరువాత, విజయ్ ఇంకో రెండు కొత్త తరం సినిమాలను నిర్మిస్తున్నాడు. ఎప్పుడూ క్రొత్త కథల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

విజయ్ తిరిగి నా జీవితంలోకి రావడం, గత దశాబ్దంలో పోయిన కొన్ని అనుబంధాలను తిరిగి తెచ్చినట్టుగా అనిపించింది. తను శాంతంగా, క్రియేటివ్‌గా, సమస్యలకు తెలివిగా పరిష్కారాలు చూపగలడు. స్క్రీన్ మీద ఖర్చు ఎలా మెరుగ్గా ఉపయోగించాలో, ఎక్కడ సేవ్ చేయాలో, ఎక్కడ స్పెండ్ చెయ్యాలో బాగా తెలిసిన వాడు. ఇది నిర్మాతకు కావలసిన మొదటి లక్షణం.

ప్రొడ్యూసర్ గా విజయ్ విలువను సూచించే కొన్ని ఉదాహరణలు:

1. ఎయిరోప్లేన్ సెట్స్ (ఎయిరోడ్రోమ్ సెగ్మెంట్స్): ఐరా విమానం దిగే సీన్ కోసం సాధారణ మార్గాలు చాలా ఖరీదైనవిగా ఎదురయ్యాయి. కానీ విజయ్ ఓ ఖాళీ పార్కింగ్ లాట్‌ని వెతికి పట్టుకుని, ఆర్ట్, CG టీమ్‌లతో సెటప్ డిజైన్ చేయించి, షెడ్యూల్‌లు మార్చి, మొత్తం ఖర్చును 80% తగ్గించాడు. ఆ రోజే సోనీ ఎగ్జిక్యూటివ్స్ వచ్చి, ఇంకో 7–8 కోట్ల పెట్టినా ఈ ప్రాజెక్ట్ ఔటపుట్ క్వాలిటీని ఇంకెవరూ సాధించలేరని అని ప్రశంసించారు. ఆ క్రెడిట్ మొత్తం విజయ్‌దే.

2. ఖర్చులో ప్రణాళిక: ముందుగా నిర్దేశించిన క్రౌడ్ కాల్‌షీట్లను రెండింతలు మించాల్సి వచ్చింది. అయినా విజయ్ షో ఎనర్జీకి అవసరమని స్పెండ్ చెయ్యమని ఎంకరేజ్ చేశాడు. కానీ అదే సమయంలో రెండున్నర రోజులు షూట్ ప్లాన్ చేసిన RCR vs Iravati సీన్‌ను(7th ఎపిసోడ్ చివరి సీన్) ని ఒక్క రోజులో పూర్తి చెయ్యమని ఛాలెంజ్ విసిరాడు. రోజుని రూ. 35 లక్షలకు పైన ఖర్చయ్యే షూట్ అది. ఎప్పుడు ఖర్చు చేయాలి, ఎప్పుడు తగ్గించాలో తెలుసుకోవడం, నిజమైన నిర్మాతకు కీలకం.

3. సృజనాత్మక సూచనలు: దర్శకుడిగా విజయ్ చాలా మంచి సూచనలు ఇచ్చేవాడు. ఉదా: ఎపిసోడ్ 1లో చివర్లో లీడ్ పాత్రలు మళ్లీ కనిపించాలనే అవసరం వచ్చింది. అప్పటి ఓపెనింగ్ ఫోన్ సంభాషణను కట్ చేసి, చివర్లో వాడొచ్చని విజయ్ ఇచ్చిన సలహా బాగా వర్కౌట్ అయ్యింది

4. ప్రతి సీన్ కోసం పోరాటం: QC ఓకే చేసిన CG షాట్స్‌ను కూడా విజయ్ చివరి నిమిషం వరకూ మెరుగుపరిచడానికి ఫైట్ చేసేవాడు. కొన్ని ఎపిసోడ్‌లు QC pass అయినా తర్వాత కూడా మళ్లీ ఖర్చు పెట్టి రీమాస్టర్ చేయించి అత్యున్నత నాణ్యత సాధించాడు.

విజయ్ ఒక శాంతమైన ముని లాంటి వ్యక్తి, తన అంతరంలో సినిమాను వేరే ఏమీ ఉండదు. ఎంత ఒత్తిడి వచ్చినా, తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోడు. పరిశ్రమకి విజయ్ లాంటి తాజా ఆలోచనలు, కొత్త ప్రతిభను ప్రోత్సహించే నిర్మాతలు అత్యవసరం.

వ్యక్తిగతంగా చెప్పాలంటే, విజయ్ తో సినిమా చేసే ప్రయాణం ముగిసే సరికి, ఒక అందమైన కాలగన్నామన్న అనుభూతినిస్తుంది. ఆ కలలో మళ్లీ జీవించాలనిపిస్తుంది. విజయ్ టు మళ్లీ సినిమా చేసే అవకాశం కోసం ఎప్పుడూ ఇదురు చూస్తుంటాను.

విజయ్ కృష్ణ, ఈ విజయం ద్వారా మరెన్నో గొప్ప అవకాశాలు అందుకోవాలని, భారతీయ సినిమా రంగంలో ఒక శక్తివంతమైన నిర్మాతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ప్రేమతో – విజయ్‌కి ధన్యవాదాలు మయసభ కోసం, మిత్రుడిగా, కుటుంబంలా నాతో ఎప్పటికీ నిలబడినందుకు.

పైరసీ ని అరికట్టండి. సోనీ లివ్ లో “మయసభ” చూడండి!

- Deva Katta

Other articles from "Mayasabha - Every Person is a Walking Story series:

20.Kiran J Kumar (Writer/Director)
19.Shakthikanth Karthik (Music Director)
18.Suresh Ragutu (Cinematographer)
17.Producers - Nagi (EP) & Sri Chow (LP)
16.Production Design - Shiva Kamesh & Thirumala
15.Direction department - Karthik, Bhargav Tetali (Bobby), Aarthi, Puneeth, Aravind
14.Nageswaar, Bhanu Prasad, Angadi Raghavendra, Narayana, Teja Raju, Giriyashvardhan, Lekya, Ruchitha Nihani
13.Parth Ganesh & Sivayya
12.Devi Sri & Ambika Yashraj
11.Charitha Varma & Yasho Bharath
10.Pranav Preetham & Phanindra Devarapalli
9.Sakul Sharmaa & Rohit Satyan
8.Bhavana
7.Ravindra Vijay
6.Shankar Mahanthi
5.Sai Kumar
4.Shatru
3.Tanya Ravi Chandran
2.Chaitanya Rao
1.Aadhi Pinisetty



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved